సపోటా
From Wikipedia, the free encyclopedia
సపోటా (Sapodilla - Manilkara zapota),[1] ఒక సతత హరితమైన చెట్టు. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది.[2] భారత ఉపఖండం, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్లకోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు.[3]
సపోటా | |
---|---|
![]() | |
సపోటా చెట్టు | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Ericales |
Family: | |
Genus: | |
Species: | మ. జపోటా |
Binomial name | |
మనిల్కరా జపోటా (లి.) P. Royen | |
చెట్టు లక్షణాలు
సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. (gummy latex called chicle.) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి alternate, elliptic to ovate, 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, with an entire margin. తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు గింజలు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో సపోనిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది tannin లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.[4][5]
సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. పూవులు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి. [6]ఇదివరకు సపోటా (Sapodilla)ను Achras sapota అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (sawo) అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో hồng xiêm (xa pô chê) అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్, కంబోడియాలలో లమూత్ (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో níspero అని, క్యూబా వంటి చోట్ల nípero అని, Kelantanese Malayలో "sawo nilo" అంటారు[7][8]
రకాలు :

మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నదిగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండ్లు బాగా తీయగా ఉంటాయి. అయితే ఈ పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైనది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ. ఇవి కాక ద్వారపూడి, కీర్తి బర్తి, పీకేయం-1, 3, డీహెచ్‌యస్ 1, 2 రకాలు కూడా అనువైనవే. వీటిలో డీహెచ్‌యస్ 1, 2 హైబ్రిడ్ రకాలు.
వైద్యపరముగా ఉపయోగాలు :
శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే.. నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది. పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడవచ్చును . సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్(Anti parasitic) సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. ఇక పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ 'ఏ 'కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ 'సీ 'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.. ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి. ఆరోగ్యంతోపాటు బరువూ పెరుగుతారు. [9]అలాగే.. తక్కువ బరువున్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది. బాలింతలు ఈ పండును ఫలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కళంగా వృద్ధి చెందుతాయి. తియ్యగా ఊరిస్తూ, భలే రుచిగా ఉన్నాయికదా అని సపోటా పండ్లను అదేపనిగా తినటం మంచిది కాదు. అలా చేస్తే అజీర్ణంతోపాటు పొట్ట ఉబ్బరం కూడా చేస్తుంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తీసుకోకూడదు. ఒబేసిటీ, మధుమేహంతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. సపోటా తినటం వల్ల చర్మం సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. తాజాపండ్లను ప్యాక్ రూపంలో కాకుండా ఆహారంగా స్వీకరించడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్- 'ఎ', 'సి' లు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి, దానికి కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటా పళ్ళు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు.[10][11]
ఆహార పోషక విలువలు170g, 1 sapodilla contains :
శక్తి - Calories: 141 నీరు -Water: 132.60g పిండిపదార్ధము -Carbs: 33.93g మాంసకృత్తులు --Protein: 0.75g పీచుపదార్థం -Fiber: 9.01g మొత్తం కొవ్వుపదార్ధము -Total Fat: 1.87g సాచ్యురేటెడ్ కొవ్వు -Saturated Fat: 0.33g చెడ్డ కొవ్వు -Trans-fats: Not known (or 0)
ఖనిజలవణాలు -Minerals:
కాల్సియం -Calcium: 35.70 mg ఐరన్-Iron: 1.36 mg మెగ్నీషియం -Magnesium: 20.40 mg భాష్వరము -Phosphorus: 20.40 mg పొటాసియం-Potassium: 328.10 mg సోడియం-Sodium: 20.40 mg జింక్ -Zinc: 0.17 mg కాఫర్ -Copper: 0.15 mg మాంగనీష్ -Manganese: Not known సెలీనియం -Selenium: 1.02mcg[12]
విటమిన్లు -Vitamins:
విటమిన్'ఏ'-Vitamin A: 102.00IU థయమిన్-Thiamine (B1): 0.00 mg రైబోఫ్లెవిన్-Riboflavin (B2): 0.03 mg నియాసిన్-Niacin (B3): 0.34 mg పాంథోనిక్ యాసిడ్-Pantothenic acid (B5): 0.43 mg విటమిన్ ' బి 6' -Vitamin B6: 0.06 mg ఫోలిక్ యాసిడ్-Folic acid/Folate (B9): 23.80mcg సయనోకొబాలమైన్-Vitamin B12: 0.00mcg విటమిన్ 'సీ'-Vitamin C: 24.99 mg విటమిన్' ఇ '-Vitamin E (alpha-tocopherol): Not known వి్టమిన్' కె ' -Vitamin K (phylloquinone): Not known[13][14]
Essential Amino Acids:
ఐసోలూసిన్-Isoleucine: 0.03g లూసిన్-Leucine: 0.04g లైసిన్-Lysine: 0.07g మితియోనిన్-Methionine: 0.01g ఫినైల్ అలమిన్-Phenylalanine: 0.02g థియోనిన్-Threonine: 0.02g ట్రిప్టోఫాన్-Tryptophan: 0.01g వాలిన్-Valine: 0.03g
Miscellaneous:
ఆల్కహాల్ -Alcohol: 0.00g కెఫిన్-Caffeine: Not known
మూలాలు
- Source : Wikipedia.org (అంతర్జాలము).
చిత్రమాలిక
- ఇంకా పండని సపోటా కాయ
- సపోటా చిన్న పిందెలు, పూత.
- సపోటాలు
- గుంటూరులో సపోటా పళ్ళ అమ్మకం
- సపోటా చెట్లో సపోట పండ్లు.వనస్తలిపురంలో తీసిన చిత్రం
మూలాలు
బయటి లింకులు, వనరులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.