జ్ఞానపీఠ్ గ్రహీత, భారత విద్యావేత్త From Wikipedia, the free encyclopedia
సత్యవ్రత శాస్త్రి (లేదా సత్యవ్రత్) శాస్త్రి (జననం సెప్టెంబరు 29 1930) భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, రచయిత, వ్యాకరణవేత్త, కవి. ఆయన మూడు మహాకావ్యాలు, మూడు ఖండ కావ్యాలు, ఒక ప్రబంధ కావ్యం, ఒక పత్రకావ్యం, ఐదు సంస్కృత విశిష్ట రచనలను చేశారు. "రామకృతిమహాకావ్యం", "బృహత్తర భారతం", " శ్రీ బోధిసత్వ చరితం", "వైదిక వ్యాకరణం", "సామాన్యదేశ్ సూత్రం విభతి", ఐదు సంపుటాలలో "సంస్కృత సంపద ఆవిష్కరణ" వంటి రచనలు ఆయన ముఖ్యమైన సాహితీ సేవలు.[1]
సత్యవ్రత శాస్త్రి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1930 సెప్టెంబరు 29 |
వృత్తి | పండితుడు,కవి, సాహిత్య విమర్శకుడు |
జాతీయత | భారతదేశం |
పూర్వవిద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. |
రచనా రంగం | సంస్కృతం |
పురస్కారాలు | 1968: సాహిత్య అకాడమీ అవార్డు 2006: జ్ఞానపీఠ అవార్డు |
జీవిత భాగస్వామి | ప్రొఫెసర్ డా.ఉషా సత్యవ్రత్ |
ఆయన ప్రస్తుతం న్యూఢిల్లీ లోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం యొక్క ప్రత్యేక కేంద్రానికి గౌరవ అధ్యాపకులుగా యున్నారు. ఆయన సంస్కృత విభాగానికి అధిపతి, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి కళల విభాగానికి డీన్ గానూ యున్నారు.
ఆయన వృత్తిలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను పొందారు.ఆయన 1968 లో సంస్కృతంలో చేసిన ప్రసిద్ధ రచన "శ్రీగురుగోవిందసింహచరితం"కు సాహిత్య అకాడమీ వారు "సాహిత్య అకాడమీ అవార్డు" యిచ్చి సత్కరించారు.[2] 2006 లో సంస్కృత భాషలో మొదటి సారి జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి వ్యక్తి.ఈ పురస్కారం థాయలాండ్ లోని ఆయన శిష్యురాలు యువరాణి మహా చక్రి సిరిండోర్న్ చే ప్రదానం చేయబడింది.[3][4]
ప్రొఫెసర్ శాస్త్రి ఆయన తండ్రి చారు దేవ శాస్త్రి ద్వారా ప్రారంభ విద్యనభ్యసించారు. ఆయన తండ్రి ప్రసిద్ధ సంస్కృత పండితుడు. ఆ తరువాత ఆయన వారణాసికి వెళ్ళారు. అచట పండిట్ సుఖ్దేవ్ ఝా, డా.సిద్దేశ్వర్ వర్మ గార్ల వద్ద అభ్యసన కొనసాగించారు.
ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృత భాషలో బి.ఎ. ఎం.ఎ. డిగ్రీలను చేసారు. ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డిని చేసారు.[5]
ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరిన తదుపరి 40 సంవత్సరాలపాటు బోధనా వృత్తిని చేపట్టి సంస్కృత విభాగానికి ప్రధాన స్థానం అయిన విభాగాధిపతిగా సేవలనందించారు. ఆయన కళల విభాగానికి డీన్ గా వ్యవహరించారు. ఆయన ఒడిషా రాష్ట్రం లోని పూరీ లోని శ్రీ జగన్నాథ్ సంస్కృత విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసారు. ఆయన బ్యాంకాక్ లోని చులలోంగ్కర్న్, సిల్పాకోర్న్ విశ్వవిద్యాలయాలకు సందర్శక ప్రొఫెసర్ గా కూడా పనిచేసారు. అదే విధంగా ఉత్తర బౌద్ధ విశ్వవిద్యాలయం (నోంగాఖాయ్, థాయ్లాండ్), జర్మనీ లోని టుబింజెన్ విశ్వవిద్యాలయం, బెల్జియం లోని కాథలిక్ విశ్వవిద్యాలయం, కెనడా లోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయంలో కూడా పనిచేసారు. థాయలాండ్ దేశ యువరాణి మహా చక్రి సిరిందార్న్ (1977-1979) కు సంస్కృతం బోధించారు..[6][7][8]
సత్యవ్రత శాస్త్రి సంస్కృత భాషలో అనేక ముఖ్యమైన కవితా సేవలను అందించారు. ఆయన రామాయణ గంథాన్ని థాయ్ నుండి సంస్కృతం నకు ముఖ్యమైన కూర్పును రూపొందించారు. ఉదా: శ్రీ రామ కీర్తి మహా కావ్యం, రాజు యొక్క అభ్యర్థన మేరకు ఈ రచన చేసారు. ఇందులో యువరాణి ముందుమాటను వ్రాసారు. ఆయన ప్రస్తుత పరిశోధనా ప్రాజెక్టులు థాయ్లాండ్ లోని హిందూ దేవాలయాలు, సంస్కృత శిలాశాసనాలు. కాళిదాసు అధ్యయనం, యోగవాశిష్టం యొక్క విమర్శనాత్మక ప్రచురణ, దక్షిణ ఆసియా సంస్కృత పదజాలం, దక్షిణ ఆసియాలోని రామ కథ.
2009 లో ఆయన సంస్కృత భాషలో జ్ఞానపీఠ అవార్డు (2006) గెలుచుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆయన సంస్కృత భాషాభివృద్ధికి చేసిన కృషికి గానూ అందజేయబడింది. ఈ అవార్డును ఆయన మాజీ శిష్యురాలు అయిన థాయ్లాండ్ యువరాణి మహా చక్రి సిరిందాన్ చేతులమీదుగా అందుకున్నారు.[4][9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.