From Wikipedia, the free encyclopedia
ఇంకా 1935లోను, 1957లోను, 1971లోను సతీ అనసూయ పేరుతో రెండు సినిమాలు వచ్చాయి.
సతీ అనసూయ (1936 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
---|---|
రచన | బలిజేపల్లి లక్ష్మికాంతం |
తారాగణం | సి.కృష్ణవేణి, రావు బాలసరస్వతి, సి.ఎస్.రావు, పి.సుందరమ్మ, పి.నారాయణరావు, ప్రకాశరావు, సూర్యనారాయణ |
సంగీతం | ప్రభల సత్యనారాయణ |
నిర్మాణ సంస్థ | ఈస్టిండియా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | మే 8, 1936 |
నిడివి | 100 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో 1936లో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ పతాకంపై తెలుగులో ధ్రువ విజయము, సతీ అనసూయ అనే రెండు సినిమాలు కలిసి రూపొందించి జతగా మే 8, 1936న విడుదల చేశారు. పెద్ద నటీనట వర్గంతో 'ధ్రువ విజయము', పిల్లలతో 'సతీ అనసూయ' నిర్మించారు. అప్పట్లో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు కలిసి చూపించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. టిక్కెట్టు వెల రెండు అణాలు ('బేడ'). కృష్ణవేణి బాలనటిగా ఈ చిత్రం ద్వారా పరిచయమైంది.
సి.పుల్లయ్య ఆ రోజుల్లో చిన్న పిల్లలతో పౌరాణికం తీయడం ఒక సాహసం, ఒక ప్రయోగం ఇందులో విజయం సాధించడం ఒక అద్భుతమైన అనుభూతి. చదువుకునే 60 మంది పిల్లలతో నటింపచేస్తూ ఈ చిత్రం నిర్మించారు. అనసూయగా కృష్ణవేణి, అత్రిగా ప్రకాశరావు, నారదుడుగా సూర్యనారాయణ, గంగగా బాల సరస్వతి, ఇంద్రుడుగా సి.ఎస్.రావు సుమతిగా సుందరమ్మ, కౌశికుడుగా నారాయణరావు నటించారు.
ఈ సినిమాకు రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. కళ అడవి బాపిరాజు, సంగీతం : ప్రభల సత్యన్నారాయణ. 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అనే అన్నమాచార్య కీర్తన ఈ చిత్రంలో ప్రప్రథమంగా వినిపించారు. మాటలు, పాటలు రికార్డుల రూపంలో రావడం ఈ చిత్రంతోనే ప్రారంభం అయింది. రికార్డులు సన్ రికార్డింగ్ కంపెనీవారు విడుదల చేశారు.[1]
మారువేషంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి తమ పత్నిలనే పతివ్రతలుగా నిరూపించాలనే ఉద్దేశ్యంతో అనుసూయకి పాతివ్రత్య పరీక్ష పెడతారు. వివస్త్రగా వడ్డిస్తే ఆతిథ్యం స్వీకరిస్తామని షరతు పెడతారు. అనసూయ అంగీకరించి వారిని స్నానం చేసి రమ్మంటుంది. వచ్చిన వారిని వరుసగా కూర్చోబెట్టి నీళ్ళు చల్లడంతో వారు పసిపిల్లలుగా మారి పోతారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి ఆ పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంది.
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
సంగీతం: ప్రభల సత్యనారాయణ
నిర్మాణ సంస్థ: ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ
రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
కళ: అడవి బాపిరాజు
ప్రొడక్షన్ మేనేజర్: రేలంగి వెంకట్రామయ్య
నేపథ్య గానం: ఆర్.బాలసరస్వతి, సి.కృష్ణవేణీ
విడుదల:1936: మే:8.
1.ఆహా ఇది ఏమి గంగాదేవికి ప్రయాస భువనైక,
2.ఆహా జగమున నే కలుషమో జలజహితుడు దయింప
3.ఇహపరానంద జీవనమీవేగా ప్రేమ సుధా సారసరసి
4.ఈశ్వరా ఇదేమి ఘోరమి సమయమున భక్తి
5.ఏది దారి నాకిచట ఈ కలుష భూతముల పాలైతిని, గానం.ఆర్.బాలసరస్వతి దేవి
6.ఏమి ఈ మాయ దినకరు డుదయించక పోవుట నేడేమి
7.కోపము తగునా తాపసులకు ఈ శాపము పో విడిచి
8.జై జై సాధ్వి జన మాననీయ జై అనసూయ జగదేకగేయా జై
9.జై మహదేవ్ దేవరా త్రిశూల ధరణ త్రిపురాంతక గణేశ
10.జై జై బోధానంద సాదురూప భవనాదీపా పాహి పాహి
11.జో అచ్యుతానంద జో జో ముకుందా రార పరమానంద, గానం.సి.కృష్ణవేణి
12.దేవా యెటుల బ్రతుకగలము మేమికన్ కారు సీకటల
13.నాతికి పతిపదసేవా స్త్రీ జాతికి సేవా పతిసేవా ముక్తికి త్రోవ
14.పతి దేవతా ప్రభావ విజయకేతనా జయతు జయతు
15.పరమానందం నాకు నేటికీ ప్రాప్తిoచెడుగా నేటికీ
16.ప్రథమ సంధ్యానియతి భగ్నమై పోయేగా విధి ,
17.భయోత్పాతమేల పావనా నీ పతిన్ బ్రతికింపనే ,
18.భారతావనీ పావనే ధన్యవే మాతా లోకాభీసుత
19.మల్లోకములనేలు ముమ్మూర్తులారా అడ్డాలలోనేడు,
1. ఆదిశక్తి పరాశక్తి నగుదునేనీ సతులలోనేన.
2.ఎచటనో పరాంగన నిజేశుడు గూడేనటన్న మాటకే ,
3.తొలి జనంబునగాని ఈ జననమందున్ గాని నాఆత్మలో,
4.ధాతకు వేద సంచయ విధాతకు భుతమయ ప్రపంచ,
5.నయనియమ వ్రతుండైన నా శుతి భవ్యంతపంబే ,
6.నామ నో నాథుడే జగన్నాథుడేని తత్పద సమాశ్రయమున,
7.పతిసేవా విధి సంతతవ్రతముగా వర్తింతునేని ,
8.భూతపతి సచరాచరభువన విలయకర్త ,
9.వగచి పనేమిక చనుడీ అనసూయా పాడాబ్జ్జయే ,
10.విగత జీవుడగు పతిన్ బ్రతికించే యము గెల్చి,
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.