సంగ్రూర్
From Wikipedia, the free encyclopedia
సంగ్రూర్ పంజాబ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది సంగ్రూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. సంగ్రూర్ శాసనసభ స్థానానికి, సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికీ కూడా సంగ్రూర్ పట్టణమే కేంద్రం.
భౌగోళికం
సంగ్రూర్ 30°15′02″N 75°50′39″E వద్ద ఉంది. [1] ఇది సముద్రమట్టం నుండి సగటున 232 మీటర్ల ఎత్తున ఉంది.
శీతోష్ణస్థితి
శీతోష్ణస్థితి డేటా - Sangrur (1971–1990) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 29.0 (84.2) |
33.3 (91.9) |
41.1 (106.0) |
46.1 (115.0) |
48.3 (118.9) |
47.9 (118.2) |
47.8 (118.0) |
44.4 (111.9) |
41.7 (107.1) |
40.0 (104.0) |
35.8 (96.4) |
29.4 (84.9) |
48.3 (118.9) |
సగటు అధిక °C (°F) | 18.9 (66.0) |
21.0 (69.8) |
26.0 (78.8) |
34.6 (94.3) |
38.8 (101.8) |
39.6 (103.3) |
34.9 (94.8) |
32.9 (91.2) |
33.4 (92.1) |
32.0 (89.6) |
26.4 (79.5) |
20.7 (69.3) |
29.9 (85.9) |
రోజువారీ సగటు °C (°F) | 12.8 (55.0) |
14.8 (58.6) |
19.4 (66.9) |
26.7 (80.1) |
31.1 (88.0) |
33.0 (91.4) |
30.5 (86.9) |
28.8 (83.8) |
28.5 (83.3) |
24.9 (76.8) |
19.0 (66.2) |
14.1 (57.4) |
23.6 (74.5) |
సగటు అల్ప °C (°F) | 6.7 (44.1) |
8.5 (47.3) |
12.8 (55.0) |
18.8 (65.8) |
23.3 (73.9) |
26.2 (79.2) |
26.1 (79.0) |
24.8 (76.6) |
23.4 (74.1) |
17.7 (63.9) |
11.6 (52.9) |
7.4 (45.3) |
17.3 (63.1) |
అత్యల్ప రికార్డు °C (°F) | −2.2 (28.0) |
−1.1 (30.0) |
1.4 (34.5) |
7.1 (44.8) |
11.7 (53.1) |
18.0 (64.4) |
17.4 (63.3) |
18.0 (64.4) |
15.2 (59.4) |
9.4 (48.9) |
0.3 (32.5) |
−1.1 (30.0) |
−2.2 (28.0) |
సగటు అవపాతం mm (inches) | 21 (0.8) |
39 (1.5) |
31 (1.2) |
20 (0.8) |
20 (0.8) |
60 (2.4) |
229 (9.0) |
189 (7.4) |
85 (3.3) |
5 (0.2) |
13 (0.5) |
21 (0.8) |
733 (28.7) |
సగటు అవపాతపు రోజులు (≥ 1.0 mm) | 2.8 | 3.6 | 4.5 | 1.9 | 2.3 | 4.7 | 11.6 | 9.6 | 4.5 | 0.5 | 1.4 | 2.1 | 49.5 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 74 | 66 | 62 | 44 | 39 | 49 | 71 | 76 | 68 | 61 | 68 | 74 | 63 |
Source 1: NOAA[2] | |||||||||||||
Source 2: India Meteorological Department (record high and low up to 2010)[3] |
ఆరోగ్య సేవలు
పౌరులకు వైద్య సదుపాయాలు కల్పించడానికి నగరంలో పిజిఐఎంఆర్ అనుబంధ కేంద్రం ఉంది . [4] టాటా మెమోరియల్ సెంటర్ వారు పంజాబ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా హోమి భాభా క్యాన్సర్ ఆసుపత్రిని సంగ్రాూర్‌లో ఏర్పాటు చేసింది.
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం సంగ్రూర్ మునిసిపాలిటీ జనాభా 88,043. ఇందులో 46,931 మంది పురుషులు, 41,112 మంది మహిళలు. లింగ నిష్పత్తి 876 గా ఉంది. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 9,027. మొత్తం అక్షరాస్యత రేటు 83.54% - పురుషులలో అక్షరాస్యులు 87.92% ఆడవారిలో 78.56%. [5]
పర్యాటక ఆకర్షణలు
బానసార్ బాగ్
సంగ్రూర్ నగరంలోని బానసార్ ఉద్యానవనం, నగరం లోని అత్యంత ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఇది పాలరాయి బారాదరీతో, 12 తలుపులతో కూడిన భవనం. ఒక చెరువు మధ్యలో ఉంది. ఓ చిన్న వంతెన ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. ఈ వంతెన, తోటల పడమటి వైపున ఉన్న పాలరాతి గేటు వద్దకు దారి తీస్తుంది. దీని పరిసరాలలో నాలుగు టవర్లు, అనేక నడక మార్గాలు, అనేక మొక్కలు, చెట్లు, ఒక చిన్న జంతుప్రదర్శన శాల ఉన్నాయి. పూర్వం, జింద్ రాజ్య పాలకులు వేసవిలో ఈ తోటల వద్ద ఉన్న భవనాలలో గడిపేవారు. [6]
జింద్ రాజ్య స్మారక ప్రదర్శనశాల
బానాసర్ బాగ్ కాంప్లెక్స్ లోనే 1865 ప్రాంతాల్లో నిర్మించిన దర్బార్ హాల్ఉంది. పంజాబ్ ప్రభుత్వపు సాంస్కృతిక శాఖ ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చింది, ఇందులో జింద్ రాజ్య పాలకులు వాడిన వస్తువులను సేకరించి ప్రదర్శనకు ఉంచారు. వారు వాడిన ఆయుధాలు కవచాలు కూడా ఇక్కడ ఉన్నాయి. [7]
షాహి సమాధన్
'షాహి సమాధన్' వద్ద పూర్వపు జింద్ రాజ్య పాలకుల సమాధులున్నాయి. ఇక్కడున్న 16 సమాధులలో పద్నాలుగింటిని 125 సంవత్సరాల క్రితం ఇటుకలు, సున్నం-సుర్కి (ఇటుక పొడి) తో నిర్మించారు. మిగతా రెండిటిని 60-65 సంవత్సరాల క్రితం పాలరాయి మొదలైన వాటితో నిర్మించారు. వీటిలో మహారాజా రంజిత్ సింగ్ మాతామహుడు మహారాజా గజపత్ సింగ్, మేనమామ మహారాజా భాగ్ సింగ్, మహారాజా ఫతే సింగ్, మహారాజా సంగత్ సింగ్, మహారాజా సరూప్ సింగ్, మహారాజా రణబీర్ సింగ్, మహారాజా రాజ్‌బీర్ సింగ్ ల సమాధులు ఉన్నాయి. ఈ సమాధులన్నీ నాభా గేట్ బయట ఉన్న ఒక సముదాయంలో ఉన్నాయి. [8]
గడియార స్థంభం
1885 లో నిర్మించిన గడియార స్థంభం, న్యాయస్థానాల సముదాయం దగ్గర దగ్గర ఉంది. దీన్ని రూర్కీ లోని కెనాల్ ఫౌండ్రీ నుండి మహారాజా రఘుబీర్ సింగ్ తెప్పించాడు. [9]
గురుద్వారా నంకియానా సాహిబ్
ఈ చారిత్రిక స్థలాన్ని సిక్కు గురువులు, గురు నానక్ సాహిబ్, గురు హర్గోబింద్ సాహిబ్‌లు సందర్శించారు. ఈ గురుద్వారా సముదాయంలో సరోవర్, రెండు దర్బార్ హాళ్ళు, లంగర్ హాల్, ఒక తోట, నివాస భవనం ఉన్నాయి. గురుద్వారాలో గుర్జా / జాపత్రి, కరీర్ చెట్టు ఉన్నాయి . ఈ జాపత్రిని రామ, తలోక సోదరులకు గురు గోవింద్ సింగ్ బహుమతిగా ఇచ్చాడు. గురు హర్గోవింద్ సాహిబ్ తన గుర్రాన్ని ఈ చెట్టుకే కట్టాడు.
మహాకాళి దేవి అలయం
పటియాలా గేట్ మార్కెట్ రహదారిపై ఉన్న చారిత్రిక మహాకాళీదేవి ఆలయాన్ని 1867 లో నిర్మించారు. ఈ ఆలయ సముదాయంలో హిందూ దేవతల మందిరాలు ఉన్నాయి. [10]
ప్రముఖ వ్యక్తులు
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్
- భగవంత్ మాన్ - సంగ్రూర్ లోక్‌సభ సభ్యుడు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.