Remove ads
జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లోని 20 జిల్లాలలోకిష్త్వార్ ఒకటి. షుపియాన్ పట్టణం జిల్లా ప్రధానకేంద్రంగా ఉంది.షోపియన్ జిల్లా (షుపియన్) ఇది భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో, షోపియన్‌లో పరిపాలనా విభాగంలో కొండలశ్రేణిలో ఉంది.[2] ఇది సాధారణంగా మొఘల్ రోడ్ అని పిలువబడే చారిత్రక రహదారిపై ఉన్నందున, దీని విస్తీర్ణం చాలావరకు అడవులలో విస్తరించి ఉంది.షోపియన్ జిల్లా పిర్ పంజాల్ శ్రేణి పరిధిలోకి వస్తుంది. ఇది శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది.[3] భారతదేశం విడిపోయిన తరువాత, ఇది పుల్వామా జిల్లాకు చెందిన తహసీలుగా మారింది.2007 మార్చిలో జిల్లా హోదాను భారత ప్రభుత్వం మంజూరు చేసింది.[4][5] జిల్లా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆపిల్ పంట ఇక్కడ ప్రధాన పంటగా పండిస్తారు.[6] షోపియాన్ అగ్లార్ నుండి 22 కి.మీ. (14 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది పుల్వామా జిల్లాతో కలుపుతుంది.ఇది జిల్లా సరిహద్దు గ్రామాలలో ఒకటి.
షోపియన్ | |||||
---|---|---|---|---|---|
జిల్లా, జమ్మూ కాశ్మీరు | |||||
పైనుండి: షోపియాన్‌లోని చారిత్రక జామియా మసీదు, హిస్టారికల్ అలియాబాద్ సరియా, హిర్పోరా వన్యప్రాణుల అభయారణ్యం | |||||
Coordinates: 33.72°N 74.83°E[1] | |||||
దేశం | భారతదేశం | ||||
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు | ||||
ప్రధాన కార్యాలయం | షోపియన్ | ||||
విస్తీర్ణం | |||||
• Total | 612.9 కి.మీ2 (236.6 చ. మై) | ||||
• Rank | భారతదేశంలో 537 వ, జమ్మూ కాశ్మీర్లో 17 వ స్థానం | ||||
జనాభా (2011) | |||||
• Total | 2,66,215 | ||||
• జనసాంద్రత | 430/కి.మీ2 (1,100/చ. మై.) | ||||
భాషలు | |||||
Time zone | UTC+5:30 | ||||
Vehicle registration | JK-22 | ||||
Website | http://shopian.nic.in |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 265,960, [7] |
ఇది దాదాపు. | బార్బడోశ్ దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 577 వ స్థానంలో ఉంది.[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 852 [7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.85%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 957 : 1000.[7] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 62.49%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. | అల్పం |
" పి.టి స్వరూప్‌నాథ్ షరీఫ్ " స్వాతంత్ర్య సమరయోధుడు ఆయనను " బాబా - ఇ - షాపియన్ " (షాపియన్ తండ్రి) అని కూడా పిలుస్తుంటారు. ఆయన సాంఘిక, రాజకీయ సంస్కర్త. ఆయన 1907లో జన్మించాడు. ఆయన నేషనల్ కాంగ్రెస్ మూలస్తంభాలలో ఒకడేగాక అబ్దుల్లాహ్ చీఫ్ కమాండర్లలో ఒకడు. షాపియన్ ప్రజల సంక్షేమానికి ఆయన జీవితమంతా కృషిచేసాడు. పి.టి స్వరూప్‌నాథ్ షరీఫ్ 1979లో చేసిన ఆందోళన ఫలితంగా షాపియన్ జిల్లా హోదాను పొందింది. ఆయన " షాపియన్ హైస్కూలును స్థాపించాడు ". తరువాత ఆయన ఆ స్కూలును అబ్దుల్లాహ్ సెకండరీ స్కూలులో సమ్మిళితం చేసాడు.
డిస్ట్రిక్ హాస్పిటల్, షాపియన్, సబ్ డిస్ట్రిక్ హాస్పిటల్ కెల్లర్,, సబ్ డిస్ట్రిక్ హాస్పిటల్ జనపొరా, పి.హెచ్.సి హర్మన్.
షోపియన్ జిల్లాలో పర్యాటక ఆకర్షణ కలిగిన పలు ప్రదేశాలు ఉన్నాయి : అరభాల్ జలపాతం, కౌంసర్నాగ్, కొంగివాటన్, అర్షిపొరా లహందూర్, సెడో, హర్పొరా వన్యప్రాణి శాక్చ్యురీ, డబ్జాన్ ( చారిత్రామకమైన మొగల్ రోడ్డు పక్కన ఉన్న హీర్పొరా గ్రామానికి 6 కి.మీ దూరంలో ఉంది) ; పీర్ మార్గ్/పీర్ గాలి (చారిత్రామకమైన మొగల్ రోడ్డు పక్కన హీర్పొరా గ్రామానికి 20 కి.మీ దూరంలో ఉంది).పీర్ కి గలికి 2 కి.మీ దూరంలో ఉన్న సుందరమైన నందంసర్ ఉంది, హాష్ వాంగ్ బగం పతర్, అనదమైన కొండశిఖరం, మొగల్ రోడ్డు పక్కన ఉన్న జజినర్ దిగువ భూభాగంలో ఉన్న సోక్ సరే, ముగల్ సరే మొదలైవి ప్రధానమైనవి. మొగల్ పాలనా కాలంలో నిర్మించబడిన " జమియా మసీద్ (షాపియన్)" (ఇది శ్రీనగర్ లోని జమియా మసీద్‌ను పోలి ఉంది). పింజురా వద్ద ఉన్న ప్రఖ్యాత అసర్ - ఐ- షరీఫ్ దర్ఘా. ఈద్-ఐ-మిలాడ్-ఉన్-నబి, షాబ్- ఐ-మెహ్రాజ్ సందర్భంలో వేలాది యాత్రీకులను ఆకర్షిస్తుంది." డ్రౌల్ ఉలూం ఇస్లామియా పింజురా " సమావేశంలో ఆధ్యాత్మిక, నీతినియమాలు గురించిన ఙానసముపార్జన కొరకు అత్యధికమైన ప్రజలు పాల్గొంటారు.
పొరుగు ప్రదేశాలు షాపియన్ కలిపే ప్రధాన రహదారులు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.