Remove ads
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
షి యోమి జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[1][2][3] చైనా సరిహద్దు వెంబడి ఉత్తర ప్రాంతాలను పశ్చిమ సియాంగ్ జిల్లాను విభజించడం ద్వారా షియోమి కొత్త జిల్లాగా 2018 డిసెంబరు 9న ఏర్పడింది. విభజించగా మిగిలిన దక్షిణ ప్రాంతాలు పశ్చిమ సియాంగ్ జిల్లాగా మిగిలిపోయాయి. దీని ప్రధాన కార్యాలయం టాటోలో ఉంది.
ఇది ఒకప్పుడు చుటియా రాజ్యంలో ఒకభాగంగా ఉంది.
మెచుకా తరువాత మెక్‌మహాన్ రేఖ భారత భూభాగాన్ని, చైనా భూభాగాన్ని వేరు చేస్తుంది.[4]
షియోమి జిల్లోలా ఆది,టాగిన్, మెంబా తెగల ప్రజలు ఎక్కువుగా నివసిస్తున్నారు. లోయలో పాటిస్తున్న మతాలలో డోని పోలో, టిబెటన్ బౌద్ధమతం, క్రైస్తవ మతాలకు చెందిన జనాభా ఉన్నారు.
షియోమి జిల్లాలో ఆది,టాగిన్, మెంబా భాషలు మాట్లాడతారు.
మెచుకా,టాటో,పిడి,మానిగోంగ్ అనే నాలుగు పరిపాలనా విభాగాలు జిల్లాలో ఉన్నాయి.అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలో మెచుకా ఒక భాగంగా ఉంది.[5][6]
అరుణాచల్ ప్రదేశ్ ఆధునిక సరిహద్దు రహదారి నిర్మాణానికి ముందు, స్థానిక ప్రజలకు సరుకులను సరఫరా చేయడానికి, భారత వైమానిక దళం ఉపయోగించే విమానాశ్రయం ద్వారా మాత్రమే ప్రవేశం ఉంది.
భారత వైమానిక దళం మెచుకాలో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఎఎల్జి)గా పిలువబడే విమానాశ్రయాన్ని నిర్వహిస్తుంది. అస్సాంలోని నగరాల నుండి అంటోనోవ్ 32 విమానం,హెలికాప్టర్ల ద్వారా కీలకమైన సామాగ్రిని తీసుకురావడానికి విమానాశ్రయం తరచుగా ఉపయోగిస్తారు. విమానాలు దిగే ప్రాంతాన్ని ప్రభుత్వం 2017లో కాంక్రీట్ తో ఉన్నత నిర్మాణంగా 4700 అడుగులకు పునర్నిర్మించి, బలోపేతం చేశారు.[7] ఈ ప్రాంతంలో గణనీయమైన సైనిక ఉనికి ఉంది. ఇది పౌరులకు కొన్ని ఉపాధి అవకాశాలను కలిగిస్తుంది.
ఉడాన్ పథకం కింద వారానికి రెండుసార్లు చిన్న విమాన సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం కింద ఉండని 9 మంది కూర్చోనే సదుపాయం గల విమానయానం నిర్ణీత సమయాలలో సేవలు నిర్వహించడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనధికార విమానయాన సంస్థల నుండి వేలం ధరఖాస్తులు ఆహ్వానించింది.[7]
షి యోమి జిల్లా, మెచుకా క్రమంగా ఒక పేరు గడించిన పర్యాటక కేంద్రంగా మారుతోంది.అరుణాచల్ ప్రదేశ్ కారణంగా దాని అత్యద్భుతమైన అందాన్ని,అన్యదేశ తెగలు,సున్నితమైన కొండలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, మెచుఖా గుండా ప్రవహించే సియోమ్ నది కూడా లోయలో ఒక సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఇక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణ మహాయాన బౌద్ధ మతానికి చెందిన 400 సంవత్సరాల పురాతన సామ్టెన్ యోంగ్చా మఠం, ఎంతో తవాంగ్ మొనాస్టరీకి సమకాలీనుడు, ఇది మెచుఖా పశ్చిమ భాగంలో ఒక కొండపై ఉంది.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.