షర్మిలా మాండ్రే (జననం 1990 అక్టోబరు 28) భారతీయ నటి, సినిమా నిర్మాత. ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటిస్తుంది. ఆమె సజ్ని (2007)తో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం కృష్ణతో విజయాన్ని అందుకుంది. అలాగే ఆమె వెంకట ఇన్ సంకట (2009), స్వయంవర (2010) చిత్రాలకు ప్రశంసలు అందుకుంది. ఆమె తమిళంలో మిరట్టల్ (2012), తెలుగులో కెవ్వు కేక (2013) సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది.[1] ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రానికి SIIMA అవార్డు అందుకుంది. షర్మిలా మాండ్రే కెరీర్ లో ఆకే (2017), గాలిపాట 2 (2022) చిత్రాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
షర్మిలా మాండ్రే | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | షర్మిల మండ్రే |
విద్య | సోఫియా హై స్కూల్, బెంగళూరు |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2007 - ప్రస్తుతం |
బంధువులు | సునంద మురళీ మనోహర్ (మేనత్త) |
ఆమె తమిళ చిత్రం ఎవనుక్కు ఎంగేయో మ్యాచ్ ఇరుక్కు (2018)తో నిర్మాతగా మారింది. బెంగుళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో షర్మిలా మాండ్రే 2012లో 10వ స్థానంలో నిలవగా 2014లో 8వ స్థానం సాధించింది. అలాగే బెంగుళూరు టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ 2020లో ఆమె 20వ స్థానంలో నిలిచింది.
ఆమె 1990 అక్టోబరు 28న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. ఆమె తన పాఠశాల విద్యను బెంగళూరులోని సోఫియా హైస్కూల్లో పూర్తి చేసింది. ఆమె తండ్రి దయానంద మాండ్రే వ్యాపారవేత్త, కార్ రేసింగ్ ఔత్సాహికుడు. ఆమె తాత రామానంద నారాయణరావు మాండ్రే సినిమా నిర్మాత, పంపిణీదారు. అలాగే ఆయన బెంగళూరులోని సంగమ్ టాకీస్ వ్యవస్థాపకుడు. షర్మిలా మాండ్రే మేనత్త సునంద మురళీ మనోహర్ సినీ నిర్మాత.
షర్మిలా మాండ్రే 2013లో తన పేరుకు అదనపు "ఇ" (Sharmiela Mandre) జోడించింది. 2020లో బెంగళూరులో ఆమె ప్రయాణిస్తున్న కారు స్తంభానికి ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి.
Year | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2007 | సజ్ని | సజ్ని | [2] | |
కృష్ణ | అంజలి | |||
ఈ బంధన | శృతి | |||
2008 | నవగ్రహ | కిరణ్ | ||
మస్త్ మజా మాడి | ఆమెనే | స్పెషల్ అప్పియరెన్స్ | ||
2009 | శివమణి | శృతి | ||
వెంకట ఇన్ సంకట | రిపోర్టర్ | |||
2010 | స్వయంవర | అనూష | ||
కరి చిరతే | శృతి | |||
2011 | ధన్ ధనా ధన్ | ఛార్మి | ||
2012 | మిరట్టల్ | దీపిక | తమిళం సినిమా | [3] |
2013 | కెవ్వు కేక | మహాలక్ష్మి | తెలుగు సినిమా | [4] |
2014 | గోవా | |||
2015 | ముంతాజ్ | అంజలి / ముంతాజ్ | ||
2017 | ఆకే | షర్మిలా దేశాయ్ / మాయ | [5] | |
మాస్ లీడర్ | షర్మిల | |||
2022 | గాలిపట 2 | షర్మిల | [6] | |
2023 | మండల: UFO ఇన్సిడెంట్ | మాయ | పోస్ట్ ప్రొడక్షన్ | [7] |
దసరా | అనికా | పూర్తయింది | [8] |
Year | Title | Cast | Language | Ref. |
---|---|---|---|---|
2018 | ఎవనుక్కు ఎంగేయో మ్యాచ్ ఇరుక్కు | విమల్, అష్నా జవేరి | Tamil | [9] |
2021 | నానుమ్ సింగిల్ థాన్ | అట్టకత్తి దినేష్, దీప్తి సతి | Tamil | [10] |
2023 | సందక్కారి | విమల్, శ్రియ శరణ్ | Tamil | |
దసరా | సతీష్ నినాసం, షర్మిల మాండ్రే | Kannada | [11] | |
కాదల్ కొంజం తూకలా | కాళిదాస్ జయరామ్, అమలా పాల్, దుషార విజయన్ | Tamil | [12] |
Year | Award | Category | Film | Result | Ref. |
---|---|---|---|---|---|
2008 | హలో గాంధీనగర అవార్డ్స్ | ఉత్తమ తొలి నటి | సజ్ని | ||
2010 | సౌత్ స్కోప్ స్టైల్ అవార్డ్స్ | మోస్ట్ స్టైలిష్ నటి - కన్నడ | స్వయంవర | [13] | |
2013 | 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ మహిళా అరంగేట్రం - తెలుగు | కెవ్వు కేక | [14] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.