శ్యామ్ బెనగళ్
భారతీయ దర్శకుడు మరియు కథారచయిత From Wikipedia, the free encyclopedia
శ్యామ్ బెనగళ్ (1934 డిసెంబరు 14 - 2024 డిసెంబరు 23) భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976), భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.[1] ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.[2]
జననం 1934 డిసెంబరు 14న తిరుమలగిరి, అల్వాల్ మండలం, హైదరాబాదులో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ దూరపు బంధువు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నాడు.
సినిమాలు
- దూరదర్శన్ ధారావాహికలు
- అమరావతి కథలు (తెలుగు, హిందీ)
- భారత్ ఏక్ ఖోజ్ (హిందీ) (1988)
- కథా సాగర్ (హిందీ) (1986)
- యాత్రా (హిందీ) (1986)
- అవార్డులు
ఇవి కూడా చూడండి
మరణం
శ్యామ్ బెనగల్ కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ 90 సంవత్సరాల వయస్సులో 2024 డిసెంబరు 23న ముంబైలో కన్నుమూసాడు.[3][4]
మూలాలు
ఇవీ చూడండి
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.