శేషంపట్టి టి.శివలింగం
From Wikipedia, the free encyclopedia
శేషంపట్టి టి.శివలింగం కర్ణాటక సంగీత నాదస్వర విద్వాంసుడు.
శేషంపట్టి టి.శివలింగం | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | சேசம்பட்டி சிவலிங்கம் |
జననం | శేషంపట్టి, ధర్మపురి జిల్లా, తమిళనాడు రాష్ట్రం | 1944 జూలై 7
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | నాదస్వర విద్వాంసుడు |
వాయిద్యాలు | నాదస్వరం |
విశేషాలు
ఇతడు తమిళనాడు రాష్ట్రం, ధర్మపురి జిల్లా, శేషంపట్టి గ్రామంలో 1944, జూలై 7వ తేదీన జన్మించాడు[1]. ఇతడు తన తండ్రి శేషంపట్టి పి.తీర్థగిరి వద్ద తంజావూరు బాణీలో నాదస్వరాన్ని నేర్చుకున్నాడు. తన తండ్రితో పాటు సేలం, ధర్మపురి, బెంగళూరు, హోసూరు వంటి ప్రదేశాలలో దేవాలయ ఉత్సవాలలో కచేరీలలో పాల్గొనే వాడు. ఇతడు తరువాత కీవలూర్ గణేశన్, కీరనూర్ రామస్వామి పిళ్ళై, టి.ఎస్.లచ్చప్ప పిళ్ళై, టి.ఎన్.కృష్ణన్, ఎం.త్యాగరాజన్, కె.వి.నారాయణస్వామి వంటి సంగీత విద్వాంసుల వద్ద తన విద్యను మెరుగుపరచుకున్నాడు. ఇతడు ఏ టాప్ గ్రేడు కళాకారుడిగా దూరదర్శన్, ఆకాశవాణిలలో అనేక జాతీయ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నాడు. మన దేశంలోను, విదేశాలలోను అనేక సంగీతోత్సవాలలో కచేరీలు చేశాడు. సంగీత గురువుగా ఇతడు అనేక మంది శిష్యులకు నాదస్వరం నేర్పించాడు. ఇతడు అనేక ఎల్.పి.రికార్డులలో తన కచేరీలను విడుదల చేశాడు.
అవార్డులు
1993లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతనికి కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2003లో కర్ణాటక సంగీత సభ "పాపనాశం శివన్ ఆవార్డు"ను ప్రకటించింది. ఇతడు కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసుడు. 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం - వాద్యం (నాదస్వరం) విభాగంలో అవార్డును ఇచ్చింది. ఇంకా ఇతనికి "సంగీత కళా శిరోమణి", "సంగీత సేవానిరత" అనే బిరుదులు ఉన్నాయి.[2]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.