Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
శివ్‌పురి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, శివ్‌పురి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. మునిసిపాలిటీ . ఇది వాయవ్య మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ డివిజన్లో భాగం. ఇది సముద్ర మట్టం నుండి 462 మీటర్ల ఎత్తున ఉంది..
శివ్‌పురి సుమారు 25.43 ° ఉత్తర అక్షాంశం, 77.65 ° తూర్పు రేఖాంశం వద్ద ఉంది. [1] పట్టణం గ్వాలియర్‌కు దక్షిణాన 120 కిమీ, ఝాన్సీకి పశ్చిమాన 96 కిమీ దూరంలో ఉంది. శివ్‌పురి సముద్ర మట్టం నుండి 462 మీ. ఎత్తున ఉంది. [2]
భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల మాదిరిగానే శివ్‌పురిలో కూడా ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది, ఇక్కడ ప్రధానంగా మూడు ప్రధాన ఋతువులు - వేడి వేసవి, వర్షాకాలం, చల్లని శీతాకాలం - ఉంటాయి. [3]
శివ్‌పురిలో వేసవి ఏప్రిల్‌లో వచ్చి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో శివ్‌పురి సగటు 40°C తో వేడిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30°C చుట్టూ ఉంటుంది. మేలో సగటు అధిక ఉష్ణోగ్రత 43°C కు చేరుకుంటుంది. ఇదే అత్యంత వేడిగా ఉండే నెల. [3]
వర్షాకాలం, జూలై-సెప్టెంబరు నెలల్లో ఉంటుంది. సగటున 34°C గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. కనిష్టంగా 20 - 24°C మధ్య ఉంటుంది. [3]
శీతాకాలపు చల్లగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఋతువు, నవంబరు నుండి మార్చి వరకు ఉంటుంది. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14°C తో కొంత చల్లగా ఉంటుంది. అయితే ఇది కనిష్ట ఉష్ణోగ్రత 6°C వరలు పడిపోతూ ఉంటుంది. [3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.