Remove ads
From Wikipedia, the free encyclopedia
శివసాగర్ రాంగులామ్ మారిషస్ దేశపు రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతావాది. బ్రిటీష్ వలసపాలన నుంచి మారిషస్ ను విముక్తం చేసే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఆయనను మారిషస్ జాతిపితగానూ భావిస్తూంటారు. మారిషస్ కు స్వాతంత్ర్యం వచ్చాకా తొలి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు. మారిషస్ కు గవర్నర్ జనరల్ గానూ పనిచేశారు.
శివసాగర్ రాంగులామ్ Sir Seewoosagur Ramgoolam | |
---|---|
మారిషస్ గవర్నర్ జనరల్ | |
In office 28 డిసెంబర్ 1983 – 15 డిసెంబర్ 1985 | |
చక్రవర్తి | ఎలిజబెత్ II |
ప్రధాన మంత్రి | Anerood Jugnauth |
అంతకు ముందు వారు | Dayendranath Burrenchobay |
తరువాత వారు | Sir Cassam Moollan (acting) |
మారిషస్ ప్రధానమంత్రి | |
In office 12 మార్చి 1968 – 30 జూన్ 1982 | |
చక్రవర్తి | ఎలిజబెత్ II |
Governor General | Sir John Shaw Rennie Sir Michel Rivalland (Acting) Sir Leonard Williams Sir Raman Osman Sir Henry Garrioch Sir Dayendranath Burrenchobay |
అంతకు ముందు వారు | Office established |
తరువాత వారు | Anerood Jugnauth |
మారిషస్ ముఖ్యమంత్రి | |
In office 26 సెప్టెంబర్ 1961 – 12 మార్చి 1968 | |
చక్రవర్తి | ఎలిజబెత్ II |
గవర్నర్ | Thomas Douglas Vickers (Acting) Sir John Shaw Rennie |
అంతకు ముందు వారు | Office Established |
తరువాత వారు | Office abolished |
Leader of Labour Party | |
In office 1 డిసెంబర్ 1958 – 15 డిసెంబర్ 1985 | |
అంతకు ముందు వారు | Emmanuel Anquetil |
తరువాత వారు | Sir Satcam Boolell |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Kewal Nagar, British Mauritius | 1900 సెప్టెంబరు 18
మరణం | 1985 డిసెంబరు 15 85) Port Louis, Mauritius | (వయసు
సమాధి స్థలం | SSR Botanical Garden |
జాతీయత | Mauritian |
రాజకీయ పార్టీ | మారిషస్ లేబర్ పార్టీ |
జీవిత భాగస్వామి | సుశీల్ రాంగులామ్ (1922-1984) [1] |
సంతానం | నవీన్ సునీత[1] |
తల్లిదండ్రులు | మోహిత్ రాంగులామ్ (తండ్రి) బాస్మతి రాంచుర్న్ (తల్లి) |
నివాసం | State House (Official) Rue Deforges, Port Louis (personal) |
కళాశాల | లండన్ విశ్వవిద్యాలయం |
నైపుణ్యం | Physician |
వెబ్‌సైట్ | ssr.intnet.mu |
శివసాగర్ రాంగులామ్ మారిషస్ కు చెందిన భారత సంతతి వ్యక్తి. ఆయన తండ్రి మోహీత్ రాంగులామ్ బీహార్కు చెందిన హరిగావ్ నుంచి మారిషస్ కు వలసవెళ్ళారు. మోహీత్ మారిషస్ లో దారిభత్యానికి కొద్ది రోజుల పాటు కట్టుగా పనిచేయడం ప్రారంభించారు. కార్మికునిగా, మేస్త్రీగా పనిచేసేవారు. అప్పటికే ఇద్దరు పిల్లలుండి, భర్త చనిపోయిన బాస్మతీ రాంచరణ్ ని వివాహం చేసుకున్నారు. వారికి 1900 సంవత్సరంలో శివసాగర్ రాంగులామ్ జన్మించారు. శివసాగర్ మాతృభాష భోజ్ పురి కాగా హిందీ, సంస్కృతం వంటి భారతీయ భాషల్లో లోతైన అభినివేశం ఉండేది. హిందూ పురాణాలు, భారతీయ సంస్కృతి తదితర అంశాలపై ఆసక్తి, అవగాహన ఉండేది. పేదకుటుంబంలో జన్మించినా కష్టించి చదివి ఇంగ్లండు వెళ్ళి వైద్యవిద్యను అభ్యసించి డాక్టర్ అయ్యారు. ఇంగ్లాండులో ఉండగా 1932లో రౌండు టేబులు సమావేశాలకు వచ్చిన మహాత్మా గాంధీని కలిశారు. మహాత్మాగాంధీ ఆయనను చాలా ప్రభావితం చేశారు.[2] అలాగే జవహర్‌లాల్ నెహ్రూ, రాస్ బిహారి బోస్ వంటివారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి.
1935లో రాంగులామ్ ఇంగ్లాండు నుంచి మారిషస్ చేరుకున్నారు. అప్పటికే స్వాతంత్ర్య సముపార్జన గురించి ఆలోచనలు చేసిన రాంగులామ్ స్వదేశానికి తిరిగి వచ్చాకా స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించారు. 1949లో మారిషస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వం వహించిన లేబర్ పార్టీ విజయం సాధించింది.
1968లో మారిషస్ కు బ్రిటీష్ వలసపాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల వల్ల ఇక వలసదేశాలన్నిటికి స్వాతంత్ర్యాన్ని ఇస్తున్న క్రమంలోనే మారిషస్ కూ స్వాతంత్ర్యం లభించిందని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఐతే శివసాగర్ రాంగులామ్ సుదీర్ఘ పోరాటం ఫలితంగానే మారిషస్ కు స్వాతంత్ర్యం లభించిందని చాలామంది చరిత్రకారులు, జనం భావిస్తూంటారు.[2] ఐతే శివసాగర్ రాంగులామ్ మారిషస్ ప్రజాదరణతో జాతి పితగా పేరొందారు.
స్వాతంత్ర్య స్థితిగతులు ఏర్పడుతూండగా 1961లోనే శివసాగర్ మారిషస్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిలో 1968 వరకూ కొనసాగారు. దేశంలోని అన్ని వర్గాలను సమీకరించి అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారన్న నమ్మకాన్ని కలోనియల్ ఆఫీస్ ఆయనపై పెట్టుకుంది, ఆ క్రమంలోనే 1965లో నైట్ హుడ్ గౌరవాన్ని పొందారు. 1968లో మారిషస్ కు స్వాతంత్ర్యం వచ్చాకా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 1968 నుంచి 1982 వరకూ వరుస ఎన్నికలను ఎదుర్కొంటూ సంకీర్ణ ప్రభుత్వాలను నిలబెట్టుకుని ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగారు. 1982 సాధారణ ఎన్నికల్లో మారిషస్ మిలిటెంట్ మూమెంట్ (ఎంఎంఎం) భాగస్వామ్య పక్షాల చేతిలో ఓటమించెందారు. స్వయంగా శివసాగర్ రాంగులామ్ పార్లమెంట్ సీటు కోల్పోయారు. మిలిటెంట్ సోషలిస్ట్ మూమెంట్ పార్టీకి చెందిన అనిరూధ్ జగ్నాథ్ ప్రధాని అయ్యారు, కానీ కొద్దికాలానికే చీలికలు రావడంతో ప్రభుత్వం కూలిపోయింది. శివసాగర్ రాంగులామ్ తన పార్టీ జగ్నాథ్ యొక్క మిలిటెంట్ మూమెంట్ పార్టీని సమర్థించారు. జగ్నాథ్ ఎన్నికై ప్రధాని కావడంతో శివసాగర్ సహకారానికి ఫలితంగా ఆయనను గవర్నర్ జనరల్ గా నియమించారు. గవర్నర్ జనరల్ పదవిలో ఆయన 1985లో మరణించేంతవరకూ కొనసాగారు.
మారిషస్ గవర్నర్ జనరల్ గా ఉండగా 1985లో అధికారిక నివాసంలోనే శివసాగర్ రాంగులామ్ మరణించారు. ఆపైన కొన్నేళ్ళకు శివసాగర్ కుమారుడు నవీన్ రాంగులామ్ లేబర్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించారు. నవీన్ 1995లోనూ, 2005లోనూ రెండుమార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టి దాదాపుగా 15 సంవత్సరాలు మారిషస్ ను పరిపాలించారు.
శివసాగర్ రాంగులాం పేరిట పలు స్మారిక చిహ్నాలు ఏర్పాటయ్యాయి. మారిషస్ లోని ప్రధాన విమానాశ్రయానికి సర్ శివసాగర్ రాంగులామ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు.[2] మారీషియన్ రూపాయి నాణేలు అన్నిటిపైనా శివసాగర్ రూపం ఉంటుంది, అలానే అత్యధిక కరెన్సీ అయిన రెండు వేల మారిషయన్ రూపాయల నోటుపైన కూడా ఆయన బొమ్మ ముద్రించి వుంటుంది. మారిషస్ లో పలు ప్రాంతాలు-పార్కులు, రోడ్లు వంటివాటికి ఆయన పేరు పెట్టారు. పోర్ట్ లూయీస్ నగరంలో, భారతదేశంలో శివసాగర్ పూర్వుల ప్రాంతమైన బీహార్ రాజధాని పాట్నాలోనూ స్మారక చిహ్నాలు నిర్మించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.