From Wikipedia, the free encyclopedia
శరద్ అనంతరావు జోషి (1935 సెప్టెంబరు 3 – 2015 డిసెంబరు 12) ప్రముఖ రైతు నాయకుడు, షెట్కారీ సంఘటన వ్యవస్థాపక నేత. ఈయన స్వతంత్ర భారత పక్ష పార్టీ వ్యవస్థాపకుడు. గొప్ప పరిశోధకుడు కూడా అయిన జోషి 2004 జూలై 5 నుంచి 2010 జనవరి 9 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సభ్యునిగా ఉన్న ఆ కాలంలో అతను 16 స్థాయీ సంఘాలలో సభ్యుడిగా పనిచేశాడు. 1958-68 మధ్య కాలంలో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌లో పనిచేసిన జోషి పిన్‌కోడ్ వ్యవస్థకు పునాది వేశాడు. తరువాతి కాలంలో అది తపాలా వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. 1980లో ఉల్లి రైతుల ఆందోళనతో అతను వెలుగులోకి వచ్చాడు.అతను రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలో మహిళలకు 33% కల్పించే మహిళాబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసాడు.[1][2][3] అతను ప్రపంచ వ్యవసాయ పోరం (WAF) సలహా బోర్డులో సభ్యునిగా ఉన్నాడు.[4] అతను "షెట్కారీ సంఘటన" అనే రైతు సంఘానికి వ్యవస్థాపకుడు. ఈ సంస్థ రైతుల సంక్షేమం కోసం "మార్కెటింగ్, టెక్నాలజీ"ని ఉపయోగించుకొనేందుకు స్థాపించిన నాన్ పొలిటికల్ సంస్థ.[5][6]
శరద్ అనంతరావు జోషి | |
---|---|
జననం | సతారా, భారతదేశము | 1935 సెప్టెంబరు 3
మరణం | 2015 డిసెంబరు 12 80) | (వయసు
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రాజకీయనాయకుడు, రచయిత, బ్యూరోక్రాట్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | షెట్కారీ సంఘటన (రైతు ఉద్యమం) |
ఆయన సెప్టెంబరు 3 1935 న మహారాష్ట్ర లోని సతారాలో అనంత్ నారాయణ్ (1905-70), ఇందిరాబాయి (1910–92) దంపతులకు జన్మించాడు. అతను 1957లో ముంబాయి లోని సైడింహం కళాశాలలో కామర్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసాడు. 1974 లో ఇంఫార్మాటిక్స్ లో డిప్లొమా చేసాడు. ఆయనకు సి.ఇ రాండిల్ గోల్డ్ మెడల్ 1955 లో అందుకున్నాడు. నీటి పారుదల ప్రయోజనాల గణనకు గాను క్యుర్సెట్జీ పురస్కారం పొందాడు. అతను 1957-58 మధ్య పూనా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం, గణాంకశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశాడు. 1958-68 మధ్య ఐ.పి.ఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీసు (క్లాస్ 1) లో పనిచేసాడు. 1968-77 మధ్య కాలంలో అతను అంతర్జాతీయ వృత్తిలో ఇంటర్నేషనల్ బ్యూరో, యుపియు, బెర్న్, స్విట్జర్లాండ్, చీఫ్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ సర్వీసులు ఉన్నాయి. "శేతాకరి సంఘటన" స్థాపనకు ముందు ఐక్యరాజ్యసమితి అధికారిగా పనిచేశారు [7][8].
అతను మహారాష్ట్రలోని రైతు సంస్థ అయిన "షెట్కారీ సంఘటన" వ్యవస్థాపకుడు. అతను భారతదేశంలో వ్యవసాయ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు నాయకత్వం వహించాడు[9][10]. వాటిలో చాలా ఆందోళనలు రైతులకు ఇచ్చే ధరల సమస్యలపై ఉన్నాయి. అతను 14 రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లకు చెందిన సోదర సంస్థలతో కూడిన 'కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (కెసిసి)' వ్యవస్థాపక నాయకునిగా తన సేవలనందించాడు. దేశీయ మార్కెట్లలో ఉల్లిపాయలు, చెరకు, పొగాకు, పాలు, వరి, పత్తి, విద్యుత్ సుంకాల పెంపుకు వ్యతిరేకంగా, గ్రామీణ అప్పులను రద్దు చేయడానికి, రాష్ట్ర డంపింగ్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, హర్యానా మొదలైన రాష్ట్రాలలో అనేక ఆందోళనలకు దారితీసింది.
'ది టైమ్స్ ఆఫ్ ఇండియా', 'బిజినెస్ ఇండియా', 'లోక్మాట్' మొదలైన దినపత్రికలకు కాలమిస్ట్ గా పనిచేశాడు. వ్యవసాయ సమస్యలపై పుస్తకాలను కూడా రచించారు.
శరద్ జోషి గ్రామీణ మహిళల అతిపెద్ద సంస్థ షెట్కరి మహిళా అగాది వ్యవస్థాపకుడు. షెట్కరి మహిళా అగాది (ఎస్ఎమ్ఎ) మహిళల ఆస్తి హక్కుల కోసం చేసిన కృషికి మహిళలు సంబరాలు జరుపుకున్నారు, ముఖ్యంగా లక్షలాది గ్రామీణ గృహిణులకు భూమి పట్టాలను ఇచ్చిన లక్ష్మి ముక్తి కార్యక్రమం కోసం ఈ సంబరాలు జరుపుకున్నారు[11].
భారతదేశ తులనాత్మక ప్రయోజనం, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం, సుగంధ, ఔషధ మొక్కలు, హైబ్రిడ్ విత్తనాల తయారీ, ఉద్యానవన రంగాలలో శరద్ జోషి సెజ్‌లను ఏర్పాటు చేయడాన్ని సమర్థించాడు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల కోసం విశ్వసనీయ ధ్రువీకరణ ఏజెన్సీలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గూర్చి జోషీ తన గళాన్ని వినిపించాడు. పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం పొందిన వివిధ రకాల ఉల్లిపాయల కోసం ప్రత్యేకమైన జోన్లను సూచించాడు. దేశీయ మార్కెట్‌ను అంతర్జాతీయ మార్కెట్ల నుండి ఇన్సులేట్ చేయవచ్చు. కొరతను కూడా నివారించవచ్చు. దీనివల్ల విదేశీ మారకం సంపాదించవచ్చు[12].
భారత రాజ్యాంగంలోని ప్రజల ప్రాతినిధ్య చట్టం నుండి సోషలిజం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ 2005 డిసెంబర్లో శరద్ జోషి రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుల చట్టాన్ని ప్రవేశపెట్టాడు. [13]
అతని రచనలు, రచనల పాక్షిక జాబితాలలో ఈ క్రిందివి ఉన్నాయి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.