శని దేవాలయం భీంపూర్

From Wikipedia, the free encyclopedia

శని దేవాలయం భీంపూర్
Remove ads

శని దేవాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో ఉంది.ఈ ఆలయాన్ని 13 మార్చి 2019 లో స్థాపించారు[1].ఈ శని దేవుని దర్శించుకుంటే భక్తుల సకల రుగ్మతలు నయం అవుతాయని అంటారు.

త్వరిత వాస్తవాలు శని దేవాలయం భీంపూర్, పేరు ...
Remove ads

శని విగ్రహ ప్రతిష్టాపన

నార్నూర్ మండల కేంద్రానికి కిలో మీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ గ్రామంలో గ్రామస్థులు శని దేవుని విగ్రహ ప్రతిష్టాపన కోసం తేది:24 డిసెంబర్ 2018‌ లో భూమి పూజ చేశారు. హనుమంతుని ఆలయ ప్రాంగణంలో శని దేవునికి స్థలం కేటాయించారు. తేది:11 మార్చి 2019 నుండి 13 మార్చి 2019 వరకు మూడు రోజుల పాటు శనీశ్వరుడు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని హిందూ ధర్మంలోని ఆచారా సాంప్రదాయం ప్రకారం శుభ ముహూర్తంలో వేద పండితులు పూజలు,మంత్రాలతో గ్రామానికి చెందిన ప్రజల,పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తుల అధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు.

Remove ads

ఆలయ ప్రత్యేకతలు

భీంపూర్ గ్రామానికి చెందిన యువకులు శని దేవుని భక్తులు శని దేవుని మీద అభిమానముతో తాండా వాసులతో ఒక వాట్సాప్ సముహాన్ని ఏర్పాటు చేసి మిత్రులు,యువకులు, బంధువులు,ఉద్యోగస్థులతో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా,నెవాసా తాలుకా లో ఉన్న సింగనాపూర్ మాదిరిగా తమ స్వంత గ్రామంలో శని మందిరం నిర్మించాలని వినూత్నంగా ఆలోచించి మందిరం నిర్మాణం కోసం విరాళాలు సేకరించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పీఠాధిపతులు,పండితుల్నీ సంప్రదించి శని దేవుని కోసం ఆలయ ఆవరణంలో పదకొండు ఫీట్ల పోడవు,పదకొండు ఫీట్ల వెడల్పుతో 5 ఫీట్ల 9 ఇంచుల ఎత్తులో దేవుని కొసం గద్దే కట్టించారు.ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపం గ్రామం నుండి నల్లని రాయిని తీసుకోవచ్చి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన శిల్పి వద్ద స్వామి వారి విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారు.విశాలమైన ఆలయ ప్రాగం ణంలో శివపార్వతునిగుడి,వినాయకుని గుడి,దత్తాత్రేయు స్వామిగుడి,నవగ్రహాల గుడి తో పాటు అంజనేయస్వామి గుడి మనకు దర్శనమిస్తుంది. శని దేవుని పూజల అనంతరం ఆలయ ఆవరణంలో కొలువైన నవగ్రహాలనీ, పార్వతీ పరమేశ్వరుల్నీ,హనుమంతుడినీ,వినాయకుడిని,దత్తాత్రేయుని,దర్శించుకోవచ్చు.ఇక్కడ ఉన్న అర్చకులు రోజువారీ పూజా కార్యక్రమాల తో పాటు శనిత్రయోదశి,శని జయింతి వంటి ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే పూజలో అనేక మంది భక్తులు పాల్గొంటారు.ఇచట భక్తులు వారి స్థాయిని బట్టి శనివారం రోజున అన్నదానం చేస్తారు.

Remove ads

ఆలయానికి భక్తులు

ఈ శని ఆలయానికి దర్శించుటకు శనివారం రోజున భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.భక్తులు తమవెంట తేచ్చుకున్న పూజ సామాగ్రితో దేవునికి పూజ చేస్తారు. మొదటగా శని దోషనివారణ కోసం దేవుని తైలాభిషేకం చేస్తారు.అ తర్వాత జిల్లేడు ఆకులు, పువ్వులు దేవుని సమర్పించి అగరొత్తులు ముట్టించి, కొబ్బరి కాయ కొట్టి మొక్కులను చెల్లించుకుంటారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తమ వెంట తెచ్చుకున్న వంట సామాగ్రితో ఆలయ ప్రాంగణంలో వంటలు ఏర్పాటు చేసి భోజనాలు ముగించుకోని సాయింత్రం ఇంటికి పయానమౌతారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయాన్ని ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు జిల్లాల నుండి వచ్చే భక్తులు నార్నూర్ మండల కేంద్రానికి చేరుకోవాలి, అచ్చట నుండి కిలో మీటర్లు దూరంలో భీంపూర్ గ్రామం ఉంది. నార్నూర్ నుండి కొత్తపల్లి (హెచ్) అటోలో కుర్చోని చేరుకోవచ్చు.

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads