శంకు
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
శంకు తెలుగు పత్రికల్లో కార్టూన్లు వేసిన చిత్రకారుడు. "శంకు" అన్న కుంచె పేరుతో కార్టూన్లు వేసిన ఇతడి అసలు పేరు ఎస్. బి. శంకర కుమార్.
ఎస్. బి. శంకర కుమార్ | |
---|---|
జననం | ఎస్.బి.శంకర్ కుమార్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | శంకు |
శంకు మొదట్లో "శంకర్" అన్న అసలు పేరుతోటే కార్టూన్లు వేస్తూ ఉండేవాడు. కాని ఆ పేరుతో ఇతరులు కూడా బొమ్మలు వేస్తూ ఉండటంతో, ప్రత్యేకత కోసం ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రచయిత, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఇతని పేరులో శంకర్ లోని శం, కుమార్ లోని కు తీసి శంకు కు జన్మ నిచ్చాడు. అప్పటినుండి, శంకు అనేక కార్టూన్లు వేశాడు. కొన్ని ధారావాహిక కార్టూన్లు కూడా వేశాడు.
శంకు బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శకత్వం వహిస్తూ ధారావాహికలు, డాక్యుమెంటరీలు తీసిన కార్టూనిస్టు శంకు. భారత దేశంలోని పేరెన్నికగన్న కార్టూనిస్టులందరి గురించి దూరదర్శన్ వారి కోసం డాక్యుమెంటరీలు తీశాడు. అందులో బాపు, ఆర్కే లక్ష్మణ్, శంకర్ పిళ్ళై, మారియో మిరాండా వంటి హేమాహేమీల గురించిన డాక్యుమెంటరీలు ఉన్నాయి.
రచయిత శ్రీ శంకరమంచి సత్యంగారి ' అమరావతి కధలు ' కొన్ని బుల్లితెరకు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీవారి కోరికపై ' తెలుగు వెలుగులు ' అనే శీర్షికపై లబ్ధ ప్రతిష్టులైన గాయని శ్రీమతి రావు బాలసరస్వతిదేవి, మహిళా ఉద్యమ నాయకురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం, శ్రీయుతులు పాలగుమ్మి విశ్వనాధం, కాపు రాజయ్య, వెంపటి చినసత్యం, మొదలైన వారిమీద విశిష్టమైన వృత్తచిత్రాలను నిర్మించారు.
భారత ప్రభుత్వ జాతీయ చానెల్ వారి 'క్లాస్సిక్ ప్రొగ్రాంస్ ' ధారావాహిక కోసం, అలనాటి హాస్యరచయిత శ్రీ మునిమాణిక్యం నరసిమ్హారావుగారి ' కాంతం కధలు ' (13 Ep) అపురూపంగా నిర్మించి యావత్ ప్రపంచంలోని తెలుగు వారి అభిమానాన్ని శ్రీ శంకు విశేషంగా చూరగొన్నారు. ఈ 13 ఎపిసోడ్ ల ధరావాహికను మునుపెన్నడూ జరగని రీతిలొ ఏకంగా 4 నంది అవర్డులు వరించడం, అత్యుత్తమ కార్యక్రమంగా గుర్తించబడి రాష్ట్ర ప్రభుత్వం సత్కరించడం ఓ విశేష గుర్తింపు.
శంకు దృశ్యరూప మిచ్చిన వంశీ వ్రాసిన "మా పసలపూడి కథలు" టివిలో ధారావాహికగా ప్రసార మయ్యాయి. మా టి వి ఛానెల్లో ఈ ధారావాహిక ప్రసారమైంది.
ఆ తదనంతరం, సాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత శ్రీ సయ్యద్ సలీం గారి రచనల ఆధారంగా 26 ఎపిసోడ్ ల ' సలీం కధలు ' రూపొందించి 2017 లో మరో 2 నంది అవార్డులు శ్రీ శంకు గెలుచుకోడం జరిగింది.
పార్వతి మళ్ళీ పుట్టింది పేరుతో 1977 లో శంకు ఒక కథ రాశాడు. శరత్ రాసిన దేవదాసు కథకు ఇది పేరడీ. దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే పేరుతో దాసరి నారాయణరావు సినిమా తీసిన సమయంలోనే శంకు ఈ కథ రాసాడు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.