From Wikipedia, the free encyclopedia
వోడితల సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, విద్యావేత్త.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3] సింగాపూర్లోని కిట్స్ విద్యాసంస్థ కార్యదర్శిగా, విఇఎస్ నిర్వహిస్తున్న పాఠశాల, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకుడిగా కూడా ఉన్నాడు.[4]
వోడితల సతీష్ కుమార్ | |||
![]() | |||
పదవీ కాలం 2014–2018, 2018 - 2023 | |||
నియోజకవర్గం | హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1965, సెప్టెంబరు 30 సింగాపూర్, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | వి.లక్ష్మీకాంత రావు, సరళదేవి | ||
జీవిత భాగస్వామి | డా. శమిత | ||
సంతానం | ఒక కుమారుడు ఒక కుమార్తె |
సతీష్ కుమార్ 1965, సెప్టెంబరు 30న కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, సరళదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో జన్మించాడు. తన తండ్రి మిలిటరీలో కెప్టెన్ గా పనిచేసాడు. కాజీపేటలో సెయింట్ గాబ్రియెల్ పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, మహారాష్ట్రలోని రాంటెక్ లోని తమ కుటుబానికి చెందిన కిట్స్ ఇంజరీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ (ఎంటెక్) చదివాడు. చదువు పూర్తయిన తరువాత కుటుంబ పరంగా వచ్చిన విద్యాసంస్థల నిర్వహణా, వ్యవసాయం, వ్యవసాయ క్షేత్ర బాధ్యతలు చేపట్టడంతోపాటు, వ్యాపార రంగంలోనూ ప్రవేశించాడు.
హైదరాబాదుకు చెందిన నీటి పారుదల శాఖ ఎస్ఈ గా ఉన్న పరాంకుశరావు కుమార్తె డా. శమితతో సతీష్ వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె పూజిత ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతోంది.
సతీష్ కుమార్ ది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సతీష్ పెదనాన్న ఒడితల రాజేశ్వర్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. తండ్రి కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా సేవలందించాడు. పీవీ నరసింహారావు 1989లో రాంటెక్ నుండి ఎంపీగా పోటీచేసినప్పుడు సతీష్ తన స్నేహితులతో కలిసి పీవీకి ప్రచారం చేసాడు. 1995లో సతీష్ సింగాపురం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2001లో టీ.ఆర్.ఎస్.లో చేరాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసాడు. 2002లో టీ.ఆర్.ఎస్. హుజురాబాద్ మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 2005లో తుమ్మనపల్లి సింగిల్ విండో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 2006, 2011 లలో వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5] 2012లో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమించబడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 73 మంది సర్పంచులను, ఐదుగురు జెడ్పీటీసీలను, 32 మంది ఎంపీటీసీలను, ముగ్గురు సింగిల్ విండో అధ్యక్షులు గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పై 34,269 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సీపీఐ పార్టీ అభ్యర్థి చాడ వెంకటరెడ్డి పై 70,530 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[6]
ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, స్వాజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు పర్యటించాడు.
Seamless Wikipedia browsing. On steroids.