From Wikipedia, the free encyclopedia
వై-ఫై లేదా వైర్లెస్ ఫిడిలిటీ అనేది ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమచార మార్పిడికి లేదా రేడియో తరంగాల ద్వారా నిస్తంత్రి (వైరులేని) అంతర్జాల అనుసంధానానికి ఉపయోగించే ఒక ప్రజాదరణ పొందిన సాంకేతికత. ఇది ఎటువంటి తీగల అనుసంధానము అవసరం లేకుండా నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇది IEEE 802.11 ప్రమాణాల ఆధారంగా వైర్లెస్ నెట్వర్క్ ప్రోటోకాల్‌ల సమూహం. వైఫై అనేది లాభాపేక్ష లేని (Non Profit- లాభం లేని ) వైఫై అలయన్స్ యొక్క ట్రేడ్ మార్కు. ఈ ట్రేడ్ మార్కు ఇంటర్ ఆపెరాబిలిటీ సర్టిఫికేషన్ పరీక్ష ద్వారా ఆమోదించే ఉత్పత్తులకు వైఫై సర్టిఫైడ్ అనే పదాన్ని ఉపయోగించే అనుమతి ఇస్తుంది.
2010 నాటికి, వైఫై అలయన్స్ ప్రపంచవ్యాప్తంగా 375 కి పైగా కంపెనీలను కలిగి ఉంది.[1]
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ప్రింటర్లు, డిజిటల్ ఆడియో ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు, కార్లు, డ్రోన్లు వంటి అనేక ఇతర సాంకేతిక పరికరాలు వైఫై ని ఉపయోగించవచ్చు.
ఆస్ట్రేలియన్ రేడియో ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ జాన్ ఓ సుల్లివన్ తో పాటు తన సహచరులు టెరెన్స్ పెర్సివాల్, గ్రాహం డేనియల్స్, డైట్ ఆస్ట్రీ, జాన్ డీన్లతో[2] కలిసి కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సి.ఎస్.ఐ.ఆర్.ఓ) యొక్క ఉప-ఉత్పత్తి గా వైఫై లో ఉపయోగించిన కీలక పేటెంట్‌ను అభివృద్ధి చేశారు.[3] 1992, 1996ల లో CSIRO దీనికి పేటెంట్ల ను పొందింది.[4][5]
1997 లో విడుదలైన 802.11 ప్రోటోకాల్ యొక్క మొదటి వెర్షన్ ముందు 2 Mbit/s లింక్ వేగాన్ని అందించింది. ఇది 11 Mbit/s లింక్ వేగాన్ని అనుమతించడానికి 802.11b తో 1999 లో నవీకరించబడింది. ఇది తరవాత కాలం లో బాగా ప్రాచుర్యం పొందింది. 1999 లో వైఫై కూటమి ఒక వాణిజ్య సంఘం గా ఏర్పడి వై-ఫై ట్రేడ్‌మార్క్ ను సంపాదించింది.[6]
వైఫై కి కనెక్ట్ Archived 2021-07-28 at the Wayback Machine అవ్వడానికి కంప్యూటర్లో వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ ఉండాలి. కంప్యూటర్, ఇంటర్ఫేస్ కంట్రోలర్ల కలయిక ను స్టేషన్ అంటారు. స్టేషన్లను వాటి MAC చిరునామాల ద్వారా గుర్తిస్తారు. వైఫై నోడ్లు తరచూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్[7] లో పనిచేస్తాయి. ఈ మోడ్ లో జరిగే అన్ని కమ్యూనికేషన్లు బేస్ స్టేషన్ ద్వారా వెళ్తాయి. ఆలా కాకుండా అడ్హోక్ మోడ్ లో యాక్సెస్ పాయింట్ అవసరం లేకుండా నేరుగా ఒకదానితొ ఇంకొక పరికరం కనెక్ట్ అవ్వచ్చు.
ఒక నిర్దిష్ట వైఫై నెట్‌వర్క్‌తో అనుబంధించబడిన అన్ని పరికరాల సమూహాన్ని సర్వీస్ సెట్ అంటారు. ఒక సర్వీస్ సెట్లో ఉన్న అన్ని పరికరాలు ఒకే వేవ్బ్యాండ్లు లేదా ఛానెల్ లో అయినా లేక వేరువేరుగా అయినా ఉండవచ్చు. ప్రతి సర్వీస్ సెట్‌కి సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్ (ఎస్ఎస్ఐడి) అనే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ 32 బిట్ సంఖ్య ఒక నెట్‌వర్క్‌లో భాగమైన అన్ని పరికరాల్లో కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది.
ఇంటర్నెట్కు అనుసంధానించబడిన రౌటర్ల పరిధిలో ఉన్న పరికరాలకు స్థానిక నెట్వర్క్, ఇంటర్నెట్ ని అందించడానికి వైఫై ఉపయోగించబడుతుంది. ఇళ్ళు, కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సులభంగా ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వైఫై ఉపయోగించబడుతుంది. విమానాశ్రయాలు, హోటళ్ళు రెస్టారెంట్ల వంటి ప్రదేశాలు తరచుగా ప్రజలను ఆకర్షించడానికీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఉచిత వైఫై హాట్స్పాట్లను అందిస్తూ ఉంటాయి.
ఇంటర్నెట్ యాక్సెస్ ను అందించడానికి భవనాల లో వైఫై యాక్సెస్ పాయింట్‌తో పాటు ఒక కేబుల్ మోడెమ్‌ను ఏర్పాటు చేయవలిసి ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ తో నడిచే రౌటర్లలో సెల్యులార్ ఇంటర్నెట్ రేడియో మోడెమ్ తో పాటు వైఫై యాక్సెస్ పాయింట్ ఉండవచ్చు. సెల్యులార్ డేటా క్యారియర్ సహాయం తో ఈ రౌటర్లు వాటి సమీపంలోని వైఫై స్టేషన్లను 2G, 3G లేదా 4G నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయగలవు. చాలా స్మార్ట్ఫోన్లు ఈ విధమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ ప్రాంతాలలో సగం మందికి పైగా ఇంటర్నెట్ అందుబాటులో లేదు.[8] అభివృద్ధి చెందిన దేశాలలో అమలు చేయబడిన సాంకేతికత చాలా ఖరీదైనది. అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు సౌర విద్యుత్తు ద్వారా నిర్వహించగలిగే మరింత పునరుత్పాదక విద్యుత్ వనరులను (Renewable energy) ఉపయోగించటానికి ఇష్టపడతాయి.
ఉదాహరణకు, 2007 లో పెరూలోని కాబో పాంటోజా, ఇక్విటోస్ల మధ్య 450 కిలోమీటర్ల నెట్వర్క్ నిర్మించబడింది,[9] దీనిలో అన్ని పరికరాలు సౌర ఫలకాల ద్వారా మాత్రమే శక్తినిస్తాయి. ఈ దీర్ఘ-శ్రేణి వైఫై నెట్‌వర్క్‌లకు రెండు ప్రధాన ఉపయోగాలు ఉన్నాయి:
ఈ మధ్య కాలం లో వైఫై వల్ల ప్రజలకి రోడ్లు, కేఫ్‌లు లేదా పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ నుంచి అయినా ఇంటర్నెట్ వాడుకుని పని చేసే సౌకర్యం లభిస్తోంది. వైర్లెస్ యాక్సెస్ లభ్యత ప్రజలను పని చేయడానికి విస్తృత ప్రదేశాల నుండి ఎంచుకునే వీలు కల్పిస్తుందని 2009 లో వచ్చిన ఒక కథనం పేర్కొంది. [10]దాని ప్రకారం, వైర్లెస్ కనెక్షన్ తో ఇంట్లో లేదా కార్యాలయం నుండి పనిచేసేటప్పుడు ఉండే అధిక స్వేచ్ఛ మంచి ఉత్పాదకతకు దారితీస్తుంది.
వైర్లెస్ సాంకేతికత పధ్ధతి లో లాంటి అనేక ఇతర ప్రత్యామ్నాయాలు అందుబాటు లో ఉన్నాయి:
Seamless Wikipedia browsing. On steroids.