పులియబెట్టిన ద్రాక్ష నుండి తయారు చేయబడిన మద్య పానీయం. From Wikipedia, the free encyclopedia
మూస:Infobox beverage
వైన్ అనేది పులియబెట్టిన ద్రాక్ష నుండి తయారు చేయబడిన మద్య పానీయం. ఈస్ట్ అనే బ్యాక్టీరియా ద్రాక్షపండ్లలోని చక్కెరను ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్‌గా మారుస్తుంది. రైస్ వైన్, ప్లం, చెర్రీ, దానిమ్మ, ఎండుద్రాక్ష, ఎల్డర్‌బెర్రీ వంటి ఇతరాలతో కూడా వైన్ తయారచేస్తారు. అయితే వైన్ వివిధ పండ్ల నుండి అనేక విధాలుగా తయారు చేయబడుతుంది, ద్రాక్ష అత్యంత సాధారణమైనది.
కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ వైన్ అనేది తయారు చేయబడుతోంది. జార్జియా (6000 BCE), పర్షియా (5000 BCE), ఇటలీ, అర్మేనియా (4000 BCE) లోని కాకసస్ ప్రాంతం నుండి వైన్ ప్రారంభమయిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. న్యూ వరల్డ్ వైన్ అనేది అమెరికా స్థానిక ప్రజలచే తయారు చేయబడిన మద్య పానీయాలకు కొంత సంబంధాన్ని కలిగి ఉంటుంది.[1] నేడు వైన్ ఉత్పత్తి ప్రాంతాలతో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, చైనా ముందువరుసలో ఉన్నాయి.[2]
వైన్ అనేది జార్జియా (సుమారు 6000 BCE),[1][3] ఇరాన్ (పర్షియా) (సుమారు 5000 BCE),[3][4] అర్మేనియా (c. 4100 BCE),[5] సిసిలీ ( సుమారు 4000 BCE)[6] లలో ప్రారంభయింది. 4500 నాటికి బాల్కన్‌లకు చేరుకుంది. పురాతన గ్రీస్, థ్రేస్, రోమ్లలో కూడా వినియోగించబడింది. మత్తు ప్రభావాల కోసం ఈ వైన్ ఉపయోగించబడింది.[7][8][9]
6000–5800 BCE నాటి ద్రాక్ష వైన్, వినికల్చర్కు సంబంధించిన తొలి పురావస్తు, ఆర్కియోబొటానికల్ ఆధారాలు ఆధునిక జార్జియా భూభాగంలో కనుగొనబడ్డాయి.[3][10] పురావస్తు, జన్యుపరమైన ఆధారాలు రెండూ ఇతర చోట్ల వైన్ ప్రారంభ ఉత్పత్తి సాపేక్షంగా తరువాత జరిగిందని సూచిస్తున్నాయి, బహుశా దక్షిణ కాకసస్ (ఇది అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్‌లను కలిగి ఉంది) లేదా తూర్పు టర్కీ, ఉత్తర ఇరాన్ మధ్య ఉన్న పశ్చిమాసియా ప్రాంతంలో జరిగింది.[11][12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.