From Wikipedia, the free encyclopedia
అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రం లోని వైట్ సాండ్స్ నేషనల్ పార్క్లో కనబడిన పురాతన మానవ పాదముద్రలు. వీటిని 2009లో కనుగొన్నారు. అవి 21,000 - 23,000 సంవత్సరాల క్రితం నాటివని అవక్షేప పొరలలో లభించిన విత్తనాలను 2021 లో కార్బన్ డేటింగు చేసినపుడు తేలింది. ఇవి, అమెరికాలో మానవుల ఉనికికి అత్యంత పురాతన ఆధారాలుగా మారాయి.[1][2] తూలారోసా బేసిన్ లోని మంచు యుగం నాటి సరస్సు ఒడ్డున 61 పాదముద్రలు లభించాయి.[3]
అయితే, విత్తనాల కార్బన్ డేటింగ్ పద్ధతిలో కాలనిర్ణయం చెయ్యడంపై 2022 లో కొందరు సందేహాలు వ్యక్తం చేసారు. రుప్పియా సిర్రోసా అనే ఈ విత్తనాలకు సంబంధించిన మొక్కలు భూగర్భజలాల నుండి కూడా కార్బన్ను తీసుకుంటాయి. అందువలన రేడియో కార్బన్ డేటింగు పద్ధతిలో చేసే కాల నిర్ణయం కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ చూపించే అవకాశం ఉందని వారు వాదించారు.[4] మళ్ళీ 2023 లో పుప్పొడిపై రేడియోకార్బన్ డేటింగు, పాదముద్రల పొరలలోని క్వార్ట్జ్ గ్రెయిన్లను ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ లుమినిసెన్స్ డేటింగ్ను చేసాక, విత్తనాల ద్వారా లెక్కించిన తేదీలు సరైనవేనని శాస్త్రవేత్తలు ధృవీకరించారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.