వేమూరి రామకృష్ణారావు
From Wikipedia, the free encyclopedia
వేమూరి రామకృష్ణారావు (1876-1939) రచయిత.
జీవిత విశేషాలు
అతను బందరులో 1876 లో హనుమాయమ్మ, పద్మనాభరావు దంపతులకు జన్మించాడు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లోని అధ్యాపకులలో అగ్రగణ్యునిగా గుర్తించబడ్డాడు. అతను రాష్ట్రంలోనే కాక దేశం అంతతా గుర్తింపు పొందాడు. కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసాడు. కళాశాల యాజమాన్యం అనుచితమైన వత్తిడులు తెస్తే ఆ పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టాడు[1]. అతను వీరేశలింగం స్వీయ చరిత్రను ఆంగ్లంలోకి అనువదించాడు.[2] గురు-శిష్యుల జంటలలో చెప్పుకోదగ్గ జంట రఘుపతి వెంకటరత్నం నాయుడు, వేమూరి రామకృష్ణారావు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్మా గాంధీ పర్యటించినపుడు జాతీయ పాఠశాల ప్రిన్సిపల్ వేమూరి రామకృష్ణారావు విద్యావిధానమును గూర్చి గాంధీజీతో చర్చించారు. ఖద్దరు వ్యాపకమును జిల్లాలో అభివృద్ధి చేయుటకై ఎక్కువగా చర్చించారు.[3]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.