వెల్లూర్ జిల్లా
తమిళనాడు లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
వెల్లూర్ జిల్లా (తమిళం) తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. జిల్లా పరిపాలనా కార్యాలయం వెల్లూర్, 2011 నాటికి, జిల్లాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,007 స్త్రీల లింగ నిష్పత్తితో 16,14,242 జనాభా ఉంది. 2017లో మానవాభివృద్ధి సూచిక ప్రకారం తమిళనాడులోని జిల్లాల జాబితాలో వెల్లూర్ జిల్లా పదకొండవ స్థానంలో ఉంది,[2][3] భారత ప్రభుత్వం ఇటీవల వేలూర్ నగరాన్ని తన ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో 26 ఇతర నగరాలతో పాటు చేర్చింది.[4]
Vellore district | |
---|---|
district | |
![]() Dry riverbed of Palar River at Arcot | |
Nickname: Fort city | |
![]() Location in Tamil Nadu, India | |
Country | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | Vellore |
Established | 1996 |
ప్రధాన కార్యాలయం | Vellore |
Boroughs | Vellore, Katpadi, Vaniyambadi, Ambur, Arakkonam, Arcot, Gudiyatham, Tirupattur and Walajah |
Government | |
• Collector & District Magistrate | R Nanthagopal IAS |
విస్తీర్ణం | |
• district | 6,077 కి.మీ2 (2,346 చ. మై) |
జనాభా (2011)[1] | |
• district | 39,28,106 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
• Metro | 13,07,998 |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 631xxx,632xxx,635601 to 635958 |
టెలిఫోన్ కోడ్ | 0416 |
Vehicle registration | TN-23,TN-73,TN-83 |
Coastline | 0 kiloమీటర్లు (0 మై.) |
Largest city | Vellore |
లింగ నిష్పత్తి | M-50.06%/F-49.94% ♂/♀ |
అక్షరాస్యత | 79.65% |
Legislature type | elected |
Legislature Strength | 12 |
Lok Sabha constituency | Vellore, Arakkonam and Thiruvannamalai |
Precipitation | 917 milliమీటర్లు (36.1 అం.) |
Avg. summer temperature | 39.5 °C (103.1 °F) |
Avg. winter temperature | 15.6 °C (60.1 °F) |
చరిత్ర
వెల్లూర్ జిల్లాకు చెందిన పురుషులు బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పోరాడి ప్రపంచ యుద్ధాల్లో తమ ప్రాణాలను అర్పించారు. ఇది 1920లో వెలిసిన వెల్లూర్‌లోని లాంగ్ బజార్‌లోని క్లాక్ టవర్‌లో నమోదు చేయబడింది, ఇక్కడ ఒక శాసనం "వెల్లూర్ - ఈ గ్రామం నుండి 277 మంది పురుషులు 1914-18లో జరిగిన మహా యుద్ధానికి వెళ్లారు, వారిలో 14 మంది తమ ప్రాణాలను విడిచిపెట్టారు".[5] ఉత్తర ఆర్కాట్ అంబేద్కర్ జిల్లా 1996లో వెల్లూర్ జిల్లాగా మార్చబడింది. 2019 ఆగస్టు 15న జిల్లాను వేలూర్, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలుగా విభజించారు.[6][7]
జనాభా గణాంకాలు
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 9,67,845 | — |
1911 | 10,57,841 | +0.89% |
1921 | 10,88,264 | +0.28% |
1931 | 12,28,535 | +1.22% |
1941 | 14,40,228 | +1.60% |
1951 | 16,76,438 | +1.53% |
1961 | 18,17,967 | +0.81% |
1971 | 22,31,448 | +2.07% |
1981 | 26,28,526 | +1.65% |
1991 | 30,26,432 | +1.42% |
2001 | 34,77,317 | +1.40% |
2011 | 39,36,331 | +1.25% |
2011 (త్రివిభజన తర్వాత) | 16,14,242 | −100.00% |
ఆధారం:[8] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, వెల్లూర్ జిల్లాలో 16,14,242 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,007 స్త్రీల లింగ నిష్పత్తితో ఉంది.ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ.
మొత్తం జనాభాలో 432,550 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, వీరిలో 2,22,460 మంది పురుషులు, 2,10,090 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, వారు 21.85% ఉండగా, షెడ్యూల్డ్ తెగలు వారు 1.85% ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 70.47% ఉంది. ఇది జాతీయ సగటు 72.99% ఎక్కువ ఉంది.
జిల్లాలో 9,29,281 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 1,53,211 సాగుదారులు, 2,54,999 ప్రధాన వ్యవసాయ కార్మికులు, గృహ పరిశ్రమలలో 1,06,906, మంది, 8,45,069 మంది ఇతర కార్మికులు, 3,29,145 మంది ఉపాంత కార్మికులు, 2,16,956 ఉపాంత వ్యవసాయ కార్మికులు, 29,509 మంది ఉపాంత కార్యకర్తలు ఉన్నారు.
పర్యాటకరంగం
జిల్లా ప్రధానకేంద్రమైన వేలూర్ నగరంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న వాటిలో వేలూర్ కోట ఒకటి. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో వేలూరుకోట అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. బ్రిటిష్ ప్రభుత్వపాలనా కాలంలో టిప్పు సుల్తాన్ కుటుంబం, శ్రీలంక చివరి రాజైన విక్రమరాజ సింహలను ఈ కోటలో రాజకీయఖైదీలుగా బంధించారు. ఈ కోటలో ఒక చర్చి, ఒక మసీదు, ఒక హిందూ ఆలయం ఉన్నాయి. 1806లో ఈ కోట నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది.దానిని వెల్లూరు తిరుగుబాటు అంటారు విజయనగర చక్రవర్తి శ్రీరంగరాజా సకుటుంబంగా హత్యచేయబడడానికి ఈ కోట సాక్ష్యంగా నిలబడింది.[9]
మలైకొడి అనే ఊరిలో పచ్చని గిరుల వరుసల పాదాల వద్ద శ్రీపురం అనే మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం ఉంది. ఈ ఆలయం వేలూర్ నగరానికి దక్షిణసరిహద్దులో తిరుమలైకొడి అనే ఊరిలో ఉంది. ఈ ఆలయం కళాత్మకంగా తయారు చేయబడిన బంగారు రేకుల తొడుగుతో చేయబడింది.[10]
వేలూరి కోటలో జలకంఠేశ్వరాలయం (వెల్లూరు) ఉంది. ఈ ఆలయం ఆకాలంనాటి శిల్పుల ప్రతిభకు అద్దంపట్టే శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ జిల్లాలో రత్నగిరి మురుగన్ ఆలయం , వాలాజాబాద్ ధన్వంతరి ఆలయం ఉన్నాయి. డి.పి పాళయంలో విజయ ఆంజనేయస్వామి ఆలయం, పొన్నై నవగ్రహ కోట్టై ఆలయం , ఉన్నాయి. వేలూరు కోటలోపల అసంప్షన్ కేథడ్రల్, 150 సంవత్సరాల పురాతనమైన సెయింట్ జాన్స్ చర్చి ఉన్నాయి. నగరానికి కేంద్రస్థానంలో పెద్ద మసీదు, భారతదేశంలోనే అతిపెద్ద అరబిక్ కాలేజి ఉన్నాయి. వాణియంబాడి - తిరుపత్తూరు రహదారి మార్గంలో పర్యాటక కేంద్రం వేసవి విడిది ఏలగిరి (హిల్ స్టేషన్) ఉంది.[11] ఏలగిరి కొండలు సముద్రమట్టానికి 1,410.6 మీటర్ల ఎత్తులో 30 2 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మిగిలిన వేసవి విడుదలలాగా కలుషితం కాకుండా, ఏలగిరి సహజసౌందర్యం చెదరకుండా ఉండడం విశేషం. వర్షాకాలంలో మాత్రమే నీరు ఉండే జలగంపారి జలపాతం ఏలగిరిలోనే ఉంది. వేలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో జవ్వాదు కొండల పాదాల వద్ద అమిర్తి నదీ సమీపంలో అమిర్తి అరణ్యం, జూలాజికల్ ఉద్యానవనం ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
రెండు జాతీయ రహదారులు - ఎన్ఎచ్ 4 (ముంబై - చెన్నై), ఎన్ఎచ్ 46 (కృష్ణగిరి - రాణిపేట్) - 2010లో జాతీయ రహదారులను పునర్నిర్మించడానికి ముందు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించేవి. గతంలో ఉన్న ఎన్ఎచ్ 4 ఎన్ఎచ్ ఎన్ఎచ్ 46 ఇప్పుడు ఎన్ఎచ్ 48గా పేరు మార్చబడ్డాయి. ఈ రహదారులు ముఖ్యంగా బెంగళూరు కోయంబత్తూరు నుండి చెన్నైకి వెళ్లే వాహనాలకు ముఖ్యమైన అనుసంధాన రహదారులు. ఈ జాతీయ రహహారులు జిల్లాలో 226 కిమీ (140 మైళ్ళు) వరకు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ఇతర ముఖ్యమైన రహదారి మార్గాలు 629 కిమీ (391 మైళ్ళు) రాష్ట్ర రహదారులు, 1,947 కిమీ (1,210 మైళ్ళు) జిల్లా రహదారులు. వెల్లూరు జిల్లాలోని రైల్వే నెట్‌వర్క్ దక్షిణ రైల్వే పరిధిలోకి వస్తుంది, వెల్లూరు కాట్పాడి జంక్షన్, వెల్లూరు కంటోన్మెంట్ జంక్షన్, గుడియాతం ప్రధాన రైల్వే జంక్షన్‌లుగా ఏర్పడతాయి. ప్రయాణీకుల కోసం అనేక చిన్న రైల్వే స్టేషన్లు, లోకల్ రైలు స్టాప్‌లు ఉన్నాయి.
చిత్ర మాలిక
- శ్రీపురం స్వర్ణద్వాలయం, వెల్లూర్
- వెల్లూర్ కోట
- వెల్లూర్ కోటలో జలకండేశ్వర ఆలయం
- వేలూర్ కోటలో అసంప్షన్ కేథడ్రల్ చర్చి
- ఆర్కాట్ వద్ద నదివైపు ఢిల్లీ గేట్ వీక్షణ
- ఏలగిరి హిల్ స్టేషన్ వద్ద లేక్ వ్యూ
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.