వృషాధిప శతకము

From Wikipedia, the free encyclopedia

వృషాధిప శతకము

వృషాధిప శతకము ను పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఇది శివ స్తుతి కలిగిన శైవ సాంప్రదాయక గ్రంధం. దీనికి హృషాదిపా అనే మకుటము కలిగిన పద్యములు కలవు.

Thumb
మహాకవి పాలకుర్తి సోమనాధుడు (Mahakavi palakurthy somanathudu)

తెలుగు శతక వాఙ్మయమున, సంఖ్యా నియమమును, మకుట నియమమును కలిగిన శతకములలో ప్రథమముగా చెప్పదగినది వృషాధిపశతకము. దీనిరచయిత పాల్లకురికి సోమనాథుడు. ఈతడు తెలుగునాటనేగాక, కర్ణాటకమున కూడ తన రచనల ద్వారా వీర శైవ మతమును ప్రచారము గావించి ఆ మతమును చిరస్థాయి కల్పించిన మహనీయుడు. వీర శైవమునకీతడు -- విజ్ఞానపీఠమని చెప్పవచ్చును. ఇతడు తెలుగున ద్వపద, శతక, గద్య రచలలకు ఆద్యుడైన మహా కవి.

రచనా శైలి

సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించాడు. "రగడ" అనే ఛందోరీతి ఇతనే ప్రారంభించాడు. ఇతడు మొదలుపెట్టిన రగడను "బసవ రగడ" అంటారు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా సీసము (పద్యం), త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదము, వన మయూరము, చతుర్విధ కందము, త్రిపాస కందము వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు.

ఇవి కూడా చూడండి


మూలాలు, బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.