From Wikipedia, the free encyclopedia
వీరభద్రుడు హిందూ దేవుడు. శివుని ప్రమథ గణాలకు అధిపతి. శివుని ఉగ్రస్వరూపం. అతనిని వీరభద్ర, వీరబతిర, వీరబతిరన్ అని కూడా పిలుస్తారు. అతనిని శివుడి కోపంతో సృష్టించాడు. దక్షుని కుమార్తె, శివుడి భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో అగ్నితో దేహ త్యాగం చేసుకున్న తరువాత, దక్షుని యజ్ఞాన్ని వీరభద్రుడు నాశనం చేశాడు. [1][2]
శైవ మతంలో, వీరభద్రుడి మూలాలు ఈ విధంగా ఉన్నాయి. సతీదేవి దక్షుని కుమార్తె. పెరుగుతున్నప్పుడు, ఆమె శివుని హృదయపూర్వకంగా ఆరాధించింది. సతీ స్వయంవరం జరిగినపుడు దక్షుడు శివుడిని తప్ప అందరి దేవతలను, రాజులను ఆహ్వానించాడు. సతీదేవి తన దండను గాలిలోకి విసిరి దానిని స్వీకరించమని శివుడిని ప్రార్థించింది. శివుడు మెడలో దండతో సభా మధ్యమంలో నిలబడ్డాడు. తన కుమార్తెకు శివుడిని వివాహం చేయడం తప్ప దక్షునికి వేరే మార్గం లేకుండా పోయింది. శివుడికీ, సతీదేవికి వివాహం జరిగింది.
శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ, అతనని ఎలాగైనా అవమానించాలన్న సంకత్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి శివుడిని మినహాయిస్తూ దేవతలందరినీ ఆహ్వానించాడు, తన తండ్రి చేసే యాగం కనుక వారిపై అభిమానం కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కావాలనేది సతీదేవి కోరిక. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది. కానీ ఆమె తల్లిదండ్రుల పట్ల ఉన్న అభిమానం కారణంగా, ఆహ్వానించబడని వేడుకకు వెళ్లకూడదనే సామాజిక మర్యాదలను అధిగమించి యాగానికి వెళ్లింది. దక్షుడు అతిథుల ముందు తన కుమార్తెను, శివుడిని అవమానిస్తాడు. ఈ అవమాన భారంతో ఆమె కోపంతో తనలో ఉనన్ యాగాగ్నితో స్వయంగా దహనం అయింది. ఆమె దేహత్యాగం చేసిన చోటున ఆమె "జ్యాలాముఖి దేవి" గా గుర్తింపు పొందింది.
ఏమి జరిగిందో తెలుసుకున్న శివుడు, తీవ్ర దుఃఖంతో, కోపంతో, తన జుట్టు నుండి కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. దాని నుండి వీరభద్రుడు, భద్రకాళి లు జన్మించారు. వీరభద్రుడు అగ్నిని నాశనం చేసేవాడు అని నమ్ముతారు: ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి. దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించిడమే ఆలస్యం... ప్రమథగణాలతో కలిసి వారిరువురూ విధ్వంసాన్ని సృష్టించారు.[3]
దక్షుని రాజ్యంలో వీరభద్రుడు తన సైన్యంతో వీరంగం సృష్టించాడు. అడ్డుపడిన వారిని ఎవరినీ వదలలేదు. చంద్రుడు, అగ్ని, పూషుడు... ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రడు, నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం మొత్తాన్ని రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుడిని కాపాడేందుకు విష్ణుమూర్తి వచ్చినా అతనిని నిలువరించడం సాధ్యం కాలేదు. నారాయణుడు ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దానిని కూడా మింగి వేసాడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షుని మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ, దక్షిణభారతంలో మాత్రం గ్రామగ్రామానా ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. భారత దేశంలో చాలాచోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె'[4]
Seamless Wikipedia browsing. On steroids.