From Wikipedia, the free encyclopedia
విశ్వరూపం 1981, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ , అంబిక నాయికానాయకులుగా నటించారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, స్వార్థపరులైన రాజకీయ నాయకుల కుట్రలకు బలికావద్దని ప్రభోదించే చిత్రం విశ్వరూపం. స్వార్థ రాజకీయ కుట్రలకు సమాజం ఏవిధంగా బలి అవుతుందన్న విషయాన్ని దర్శకుడు చక్కగా వివరించాడు.[1] ఇందులో కళాశాల అధ్యాపకునిగా, పచ్చిరౌడీగా ఎన్.టి.ఆర్. తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
విశ్వరూపం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జయసుధ , అంబిక |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కవిరత్న మూవీస్ |
భాష | తెలుగు |
నిర్మాణ సంస్థ.కవిరత్న మూవీస్
దర్శకత్వం.దాసరి నారాయణరావు
సంగీతం.చక్రవర్తి
Seamless Wikipedia browsing. On steroids.