గ్రామం, భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం From Wikipedia, the free encyclopedia
13-15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి.
Group of Monuments at Hampi | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | Cultural |
ఎంపిక ప్రమాణం | (i)(iii)(iv) |
మూలం | 241 |
యునెస్కో ప్రాంతం | Asia-Pacific |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1986 (10th సమావేశం) |
అంతరించిపోతున్న సంస్కృతి | 1999–2006 |
14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తరం వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెలిబుచ్చుతాయి.
నగరం యొక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలో కమలాపురకు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం ద్రవిడ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన చేపలు, జలచరాలు పర్యాటకుల కళ్ళకు విందు.
800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళున్నాయి.
చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజులే నిర్మించారు.[4]
విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరంలోని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.[5]
విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు. విరుపాక్ష దేవాలయంలో దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్దం మెదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.[6]
తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది.[8]
ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసరాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి. [9] విరుపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మి. దూరం వరకు కనిపిస్తుంది.[10]
హంపికి ఈశాన్య భాగంలో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.
ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉంది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి.
పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గరలోనే గజశాల ఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.[11]
గోపురం నీడ ప్రధాన ఆలయం లోని ఒక చిన్న రంద్రంలో నుండి క్రింద నుండి పైకి అనగా తలక్రిందులుగా కనపడటం అప్పటి కళా చాతుర్యంకి నిదర్శనం
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.