Remove ads

పాల సామ్రాజ్యకాలంలోని, రెండు ప్రముఖమైన బౌద్ధ అభ్యాసకేంద్రాలలో ఒకటి నలందా విశ్వవిద్యాలయం కాగా రెండవది ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం. నలందా విశ్వవిద్యాలయంలోని పండితుల నాణ్యత పడిపోతూ ఉండుటవల్ల, పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించాడు. ఇక్కడి పండితులలో ముఖ్యమైనవాడు అతిషుడు.

  ?విక్రమశిల
Vikramaśīla
బీహార్  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 25.3244°N 87.2867°E / 25.3244; 87.2867
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం భగల్‌పూర్
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్

• +0641
విక్రమశిల విశ్వవిద్యాలయ శిథిలాలు

ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని భగల్‌పూర్ 50 కి.మీ దూరంలో అంతిచక్ గ్రామం ఉన్న స్థలమే ఒకప్పటి విక్రమశిల విశ్వవిద్యాలయం.

చరిత్ర

పాలవంశరాజుల కాలంలో ప్రాచీన వంగ, మగధ ప్రాంతాలలో ఎన్నో బౌద్ధ మఠాలు వెలిసాయి. టిబెట్‌వారి సమాచారం ప్రకారం, ఆ కాలంలో ఐదు మహావిహారాలుండేవి. మొదటిదైన విక్రమశిల ఆ కాలంనాటి అత్యున్నతమైనది కాగా, నాలందా పాతదైపోయినప్పటికీ వెలుగులీనుతూనే ఉంది. మిగిలినవి సోమపుర, ఓదంతపుర, జగ్గదల లు.

పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించినప్పటి నుండి 12వ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ అనేక బౌద్ధ కేంద్రాలతో బాటు దీనిని కూడా ధ్వంసం చేసేవరకూ వెలుగొందింది. మనకు విక్రమశిల గురించిన సమాచారం కేవలం టిబెట్ వారి వద్దనే లభ్యమౌతోంది. అందులో ముఖ్యమైనవి క్రీ. శ 16-17 శతాబ్దాలనాటి తారనాథుడనే టిబెట్ సన్యాసి రచనలు.

100మందికి పైగా అచార్యులతోనూ, 1000కిపైగా విద్యార్థులతోనూ విక్రమశిల అతి పెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం. బౌద్ధ అభ్యాసం, సంస్కృతి, మతం ప్రచారం చేసేందుకు ఇక్కడి పండితులకు విదేశాలనుండి కూడా అహ్వానాలోస్తూ ఉండేవి.

Remove ads

సంస్థ

విక్రమశిల తక్కిన విశ్వవిద్యాలయాకంటే స్పష్టమైన అధికార క్రమాన్ని కలిగి ఉండేదని, సుకుమార్ దత్త్ వంటివారి అభిప్రాయం.

  • అధ్యక్షుడు
  • ద్వారపాలకుడు లేదా ద్వారపండితుడు (ద్వారాలు ఆరు. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, మొదటి మద్యం, రెండవ మద్యం)
  • మహాపండితుడు
  • పండితుడు (సుమారుగా 108 మంది)
  • ఉపాధ్యాయులు లేదా అచార్యులు (పండితులతో కలిపి 160మంది)
  • భిక్షువులు (సుమారుగా 1000మంది)

ఇచ్చట విద్యాభ్యాసము ముగించినవారికి రాజులు 'పండిత ' అని బిరుదునిచ్చి గౌరవించుచుండిరి. రత్నవ్రజ, జేతారి, ద్వీపంకర, రత్నకీర్తి, జ్ఞానశ్రీమిత్ర, రత్నాకరశాంతి మున్నగువారీ పండితులలో అగ్రగణ్యులు. విక్రమశిలావిద్యాపీఠమున ఆరుద్వారములుండెడివి. వానివద్ద దిగ్దంతులగు పండితులుండెరి. వీరిలో ప్రజ్ఞాకరమతి అనునాతడు దక్షిణద్వారమున, రత్నాకరశాంతి ప్రాగ్ద్వారమును, వాగీశ్వరకీర్తి ఉతారద్వారమును నొకప్పుడు రక్షించుచుండెరని తారానాధుడనే చరిత్రకారుడు వ్రాసియున్నాడు. ఈ ఆరు ద్వారములకు ఎదురుగా ఆరు విశాలమగు కళాశాలలుండెడివి. ఒకో కళాశాలలో నూటయెన్మండు ఉపాధ్యాయులుండిరి. ఇదిగాక దీని అంతర్భాగమున ఒకేసారిగ యెనిమిదివేలమంది ఉపాసకులు నిల్చుటకు సరియగు స్థలము ఉండేడిదట. ఈ విద్యాపీఠము చుట్టునూ గల గోడపై సింహద్వారమునకు దక్షిణ పార్స్వమున నాగార్జునియొక్కయు, ఉత్తరపార్స్వంబున దతిశుని యొక్కయు చిత్రములు వ్రాయబడియున్నవి. ఈవిధముగ పండితశిఖామణులిచ్చట బహూకరింపబడుచుండెరి.

బౌద్ధ తంత్రమునకు ఈ విశ్వవిద్యాలయము విశేషవిఖ్యాతి వహించి యుండెను. సా.శ.5 వ శతాబ్దమున ఇంద్రజాలాదికములతో గూడిన తంత్ర శాస్త్రము బౌద్ధులలో ప్రబలి 8, 10 వ శతాబ్దములలో విశేషముగ అభివృద్ధి చెందినది. ఏకేశ్వరాత్మకమగు మహాయాన బౌద్ధమున ఈ శక్త్యారాధమగు ఈ తంత్ర విద్య చేర్చారు. వ్యాకరణ, వేదాంత, తర్కశాస్త్రమలు పిమ్మట పేర్కొన వలసిన విషయములు. నాలందా విద్యాపఠమునకు పిమ్మట విశేషఖ్యాతిని గాంచిన ఈ విద్యాపీఠము తుదకు భక్తయార్ ఖల్జీచే నాశనమొనర్పబడెను.[1]

Remove ads

వాస్తు, త్రవ్వకాలు

విశ్వవిద్యాలయ శిథిలాలలో కొన్నిటిని మాత్రమే ఇప్పటివరకూ తవ్వకాలలో బయట పడ్డాయి.

స్థూపం

Thumb
మధ్యభాగంలోని ప్రధానస్థూపం

చేరడం ఎలా..?

దగ్గర్లోని పెద్ద పట్టణం కహాల్‌గావ్ 13కి.మీ దూరంలో ఉంది. భారతీయ రైల్వే ఢిల్లీ నుండి భగల్‌పూర్‌కి నెం2367/2368 విక్రమశిల ఎక్స్‌ప్రెస్ ని కూడా నడుపుతోంది.

విశేషాలు

Thumb
తవ్వకాల చోటు వద్దనున్న మ్యూజియం. ఇక్కడ తవ్వకాలలో బయటపడిన శిల్పాలు, కళాఖండాలు, పాత్రలు, నాణేలు, ఆయుధాలు, ఆభరణాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి.
Thumb
స్థూపం వద్ద నుండి ప్రవేశద్వారం
Thumb
విశ్వవిద్యాలయపు స్తంభాలు
Thumb
చర్చాస్థలి, ధ్యానస్థలి తదితరాల శిథిలాలు

బయటి లింకులు

త్వరిత వాస్తవాలు
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads