From Wikipedia, the free encyclopedia
వికీలీక్స్ వికీమీడియా ప్రాజెక్ట్ లో భాగం , అందువల్ల వికీపీడియాతో ఎటువంటి అనుబంధము లేదు
నినాదం | ప్రభుత్వాలను తెరపైకి తెస్తాం. |
---|---|
వ్యాపారాత్మకమా? | కాదు |
సైటు రకం | సమూహ పరచిన దస్తావేజులు |
లభ్యమయ్యే భాషలు | పలు భాషలు |
యజమాని | ద సన్ షైన్ ప్రెస్[1] |
సృష్టికర్త | జూలీన్ అసెన్జ్ |
విడుదల తేదీ | డిసెంబర్ 2006 |
అలెక్సా ర్యాంక్ | 2,367(అక్టోబర్, 2010)[2] |
ప్రస్తుత పరిస్థితి | Active |
వీకీలీక్స్ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మామూలుగా, అందరికి అందుబాటులోలేని సమాచారాన్ని, పత్రాలను, దస్తావేజులను, చిత్రాలను , రహస్యంగా, గుప్తచారుల ద్వారా సేకరించి, సమూకరించి ప్రచురిస్తుంది. అంతేకాదు, సంస్థకోసం మాత్రమే ఇంటర్నెట్లో పొందుపరచబడిన గుప్తసమాచారాన్ని క్రోడీకరించి ప్రచురిస్తుంది.[1] వీకీలీక్స్ సంస్థ స్తాపింపబడిన ఏడాది లోపునే 12 లక్షల దస్తావేజులు, పత్రాలు మొదలైనవి సంపాదించి, డేటాబేంక్ లో భద్ర పరచింది.[3]
ఉత్తరమెరికా,తైవాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చైనా దేశాల నుండి[1] పాత్రికేయులు, మేధావులు, విజ్ఞానవేత్తలు, కంప్యూటర్ మేథావులు, శాస్త్రజ్ఞులు,చైనా విప్లవకారులు మొదలైన వారందరు కలసి స్థాపించిన సంస్థ. ద న్యూయార్కర్లో, 2010 జూన్ 7 న ప్రచురింపబడిన వార్త ప్రకారం జూలియన్ ఆసాన్జె అనే ఆస్ట్రేలియా పాత్రికేయుడు, ఇంటర్నెట్ ఉద్యమకారుడు ఈ సంస్థకు ప్రధాన అధికారి, డైరెక్టర్.[4],[5].
వీకీలీక్స్ ఎన్నో ప్రశంసలను, బహుమతులను అందుకొనింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది: ఎకానమిస్ట్ పత్రిక వారి, న్యూమీడియా బహుమతి,[6] జూన్ 2009,లో వీకీలీక్స్, జూలియన్ అస్సన్జ్ అమ్నెస్టి ఇంటర్నేషనల్ వారి బహుమతి, (2008లో, ప్రచురింపబడ్డ "కెన్యా: ద క్రై ఆఫ్ బ్లడ్" (Kenya: The Cry of Blood – Extra Judicial Killings and Disappearances),కు గాను లభించింది.[7] కెన్యా జాతీయ మానవ హక్కుల సంఘం రిపోర్ట్,[8] మే 2010లో, న్యూయార్క్ డైలీ న్యూస్ వీకీలీక్స్ ని "ప్రపంచ చరిత్రలో వార్తా ప్రచురణ విప్లవం స్తృష్టించిందని పేర్కొంది.[9]
ఏప్రిల్ 2010లో , వీకీలీక్స్ ఒక విడియోను వెబ్సైట్లో ప్రదర్శించింది2007 బాగ్దాద్ సంఘటన. ఇందులో సామూహిక హత్య అన్న శీర్షికతో, ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన వైనం చిత్రీకరించబడింది. అదే సంవత్సం జూలైలో, ఆఫ్గన్ వార్ డైరీ, అన్న పేరుతో 76,900 పై చిలుకు పత్రాలను వార్ ఇన్ ఆఫ్గనీస్తాన్ అన్న పేరుతో విడుదల చేసింది.[10] అక్టోబర్ లో దాదాపు 400,000 పత్రాల ఇరాక్ వార్ లాగ్స్ అన్న అంశంతో విడుదల చేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.