వాసంతి
From Wikipedia, the free encyclopedia
వాసంతి తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల నిర్మాత కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని తిమ్మసముద్రం గ్రామం ఈవిడ స్వస్థలం. ఈవిడ 'లా' చదువు తున్నప్పుడు "తేన్నిలవు" అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఔట్‌డోర్ షూటింగు కోసం కాశ్మీర్ వెళ్ళవలసి రావడం చేత ఈమె లా పూర్తి చేయలేకపోయింది. ఆ తరువాత బలేపాండ్యన్, ఎన్నదాన్ ముడివు మొదలైన తమిళ చిత్రాలలోను, పాదుకా పట్టాభిషేకం, అమ్మైకాన మొదలైన మళయాల చిత్రాలలోను, అనేక తెలుగు చిత్రాలలోను నటించారు.
చిత్ర సమాహారం
నటిగా
- విరిసిన వెన్నెల (1961) - తొలి సినిమా
- మహాకవి కాళిదాసు (1960) - కాళికాదేవి
- సిరిసంపదలు (1962) - లత
- మంచి మనసులు (1962) - జయ
- ఆరాధన (1962)
- దక్షయజ్ఞం (1962)
- పునర్జన్మ (1963) - పునర్జన్మ
- సవతి కొడుకు (1963)
- వివాహబంధం (1964) - అరుణ
- శభాష్ సూరి (1964)
- నవగ్రహ పూజా మహిమ (1964)
- కీలుబొమ్మలు (1965)
- గుడిగంటలు (1965) - సుభద్ర
- ఉయ్యాల జంపాల (1965)
- సుమంగళి (1965) - ఉమ
- ఆత్మగౌరవం (1966) - పార్వతి
- పల్నాటి యుద్ధం (1966) - పేరిణీ దేవి
- శ్రీమతి (1966)
- వీరాంజనేయ (1968)
నిర్మాతగా
- భలేపాప (1971)
- మేమూ మనుషులమే (1973)
లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.