వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
From Wikipedia, the free encyclopedia
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 08 జనవరి 2021లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి ఛైర్ పర్సన్‌గా భాద్యతలు చేపట్టింది.[1]
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి | |||
![]() | |||
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ | |||
పదవీ కాలం 08 జనవరి 2021 - 2023 అక్టోబర్ 26 | |||
మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 1 డిసెంబర్ 2010 – 2014 | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 1999 – 2014 | |||
నియోజకవర్గం | నర్సాపూర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | సికింద్రాబాదు | 5 ఏప్రిల్ 1968||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | వాకిటి లక్ష్మా రెడ్డి | ||
సంతానం | శ్రీనివాస్ రెడ్డి , శశిధర్ రెడ్డి | ||
వెబ్‌సైటు | http://www.sunithalaxmareddy.in/ |
జననం
ఈమె ఏప్రిల్ 5, 1968న జన్మించింది. బీఎస్సీ వరకు అభ్యసించింది.
రాజకీయ ప్రస్థానం
సునీత లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగి, 2010లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వహించింది.[2] ఆమె 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేసింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవించిన అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి 2019, ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[3][4][5] వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని 2020 డిసెంబర్ 28న తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[6]
సునీతా లక్ష్మారెడ్డి 08 జనవరి 2021లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి ఛైర్ పర్సన్‌గా భాద్యతలు చేపట్టింది.[7][8] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేస్తూ 2023 అక్టోబర్ 25న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆమెకు బీఫామ్ అందచేశాడు.[9]
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి అక్టోబర్ 26న రాజీనామా చేయగా ఆమె రాజీనామాను ఆమోదిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.[10][11]

బంధుత్వం
సునితా లక్ష్మారెడ్డి భర్త వి. లక్ష్మారెడ్డి గోమారం గ్రామ సర్పంచిగా, జడ్పీటీసి సభ్యుడిగా పనిచేశారు.[12]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.