Remove ads
From Wikipedia, the free encyclopedia
వసంత్ చింధుజీ పుర్కే (జననం 3 మే 1956) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మహారాష్ట్ర శాసనసభకు రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి 1995 నుండి 2009 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా,[1] పాఠశాల విద్యా, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
వసంత్ పుర్కే | |||
పదవీ కాలం 1995 – 2014 | |||
ముందు | నేతాజీ రాజ్గడ్కర్ | ||
---|---|---|---|
తరువాత | అశోక్ ఉయిక్ | ||
నియోజకవర్గం | రాలేగావ్ | ||
పదవీ కాలం 4 డిసెంబర్ 2010 – 8 నవంబర్ 2014 | |||
ముందు | మధుకరరావు చవాన్ | ||
తరువాత | విజయరావు భాస్కరరావు ఆటి | ||
పాఠశాల విద్యా శాఖ మంత్రి | |||
పదవీ కాలం 9 నవంబర్ 2004 – 1 డిసెంబర్ 2008 | |||
ముందు | సురేష్ జైన్ | ||
తరువాత | బాలాసాహెబ్ థోరాట్ | ||
క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 1 నవంబర్ 2004 – 4 డిసెంబర్ 2008 | |||
ముందు | రామకృష్ణ మోర్ | ||
తరువాత | రవిశేత్ పాటిల్ | ||
హింగోలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి | |||
పదవీ కాలం 1 నవంబర్ 2004 – 4 డిసెంబర్ 2008 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | రాలేగావ్ , యవత్మాల్ జిల్లా , మహారాష్ట్ర | 1956 మే 3||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ప్రేమలత పుర్కే | ||
పూర్వ విద్యార్థి | అమరావతి విశ్వవిద్యాలయం ( MA ) |
వసంత్ పుర్కే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ తరువాత వరుసగా 1999, 2004 & 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2004 నవంబర్ 9 నుండి 2008 డిసెంబర్ 1 వరకు పాఠశాల విద్యా, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రిగా, 2010 డిసెంబర్ 4 నుండి 2014 నవంబర్ 8 వరకు మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పని చేశాడు.
వసంత్ పుర్కే 2014, 2019 & 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా ఓడిపోయాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.