From Wikipedia, the free encyclopedia
వనమాడి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
వనమాడి వెంకటేశ్వరరావు | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 - | |||
ముందు | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కాకినాడ పట్టణ | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
ముందు | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | ||
తరువాత | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1963 కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | వనమాడి లోవరాజు | ||
జీవిత భాగస్వామి | శ్రీదేవి | ||
నివాసం | హౌస్.నెం.46-13-4, చర్చ్ స్క్వేర్, జగన్నైక్పూర్, కాకినాడ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
వనమాడి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నాడు.
వనమాడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు పై 4506 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ చేతిలో 33446 ఓట్ల తేడాతో, 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 18641 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. వనమాడి వెంకటేశ్వరరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై 24,259 ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో 14111 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
వనమాడి వెంకటేశ్వరరావు 2024లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై 56572 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
Seamless Wikipedia browsing. On steroids.