లిండ్సే వీర్

న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia

గోర్డాన్ లిండ్సే వీర్ (1908, జూన్ 2 - 2003, అక్టోబరు 31) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. 1930 నుండి 1937 వరకు న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. తన జుట్టును త్వరగా పోగొట్టుకొని, తన సహచరుల కంటే పెద్దవాడిగా కనిపించడంతో ఇతన్ని డాడ్ వీర్ అని పిలిచేవారు.[1] తన మరణానంతరం ఇతను ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
గోర్డాన్ వీర్
దస్త్రం:Lindsay Weir.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గోర్డాన్ లిండ్సే వీర్
పుట్టిన తేదీ(1908-06-02)1908 జూన్ 2
ఆక్లాండ్, న్యూజీలాండ్
మరణించిన తేదీ31 అక్టోబరు 2003(2003-10-31) (aged 95)
ఆక్లాండ్, న్యూజీలాండ్
మారుపేరుDad
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మాధ్యమం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 14)1930 24 January - England తో
చివరి టెస్టు1937 14 August - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1927/28–1946/47Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 11 107
చేసిన పరుగులు 416 5,022
బ్యాటింగు సగటు 29.71 32.19
100లు/50లు 0/3 10/26
అత్యధిక స్కోరు 74* 191
వేసిన బంతులు 342 9,395
వికెట్లు 7 107
బౌలింగు సగటు 29.85 37.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/38 6/56
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 70/–
మూలం: Cricinfo, 2017 1 April
మూసివేయి

జననం

వీర్ 1908, జూన్ 2న ఆక్లాండ్‌లో జన్మించాడు.

దేశీయ క్రికెట్

కుడిచేతి బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-పేస్డ్ బౌలర్ గా రాణించాడు. ఆక్లాండ్ రగ్బీ యూనియన్ జట్టు కోసం తొమ్మిది ఫస్ట్-క్లాస్ ప్రదర్శనలు కూడా చేసాడు, ప్రధానంగా ఫ్లై-హాఫ్‌లో ఆడాడు.[1]

1927-28 నుండి 1946-47 వరకు ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 10 సెంచరీలు చేసి 107 వికెట్లు తీసుకున్నాడు. నిష్ణాతుడైన స్ట్రోక్-ప్లేయర్ గా 1935 డిసెంబరులో ఒటాగోపై తన అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోర్ 191 సాధించాడు.[2]

అంతర్జాతీయ కెరీర్

1930లో టూరింగ్ ఇంగ్లాండ్ జట్టుతో న్యూజీలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక కాలేదు. కానీ సిరీస్‌లోని ఇతర మూడు టెస్టుల్లో ఆడాడు. 1931లో ఇంగ్లాండ్‌ పర్యటనలో మూడు టెస్టుల్లోనూ ఆడాడు. ఈ పర్యటనలో 25.87 బ్యాటింగ్ సగటుతో 1,035 పరుగులు చేశాడు. టెస్టుల్లో 24.00 సగటుతో 96 పరుగులు కూడా చేశాడు. స్వదేశంలో, 1932లో దక్షిణాఫ్రికాపై రెండు టెస్టులు, 1933లో ఇంగ్లండ్‌పై రెండు టెస్టులు ఆడాడు. ఎంసిసికి వ్యతిరేకంగా 1935-36 సిరీస్‌లో ఆడలేదు, కానీ 1937లో ఓవల్‌లో తన చివరి టెస్టు ఆడాడు. మూడు టెస్ట్ హాఫ్ సెంచరీలు చేశాడు, ఏడు టెస్ట్ వికెట్లు తీశాడు.[1]

తరువాతి జీవితం

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, వీర్ 12 సంవత్సరాలపాటు ఆక్లాండ్ టీనేజ్ బ్రాబిన్ కప్ జట్టుకు సెలెక్టర్-కోచ్‌గా ఉన్నాడు.[1] ఆక్లాండ్‌లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్‌లో ఇంగ్లీష్ బోధించాడు, అక్కడ రగ్బీ, క్రికెట్‌కు శిక్షణ ఇచ్చాడు.

1937లో ఓవల్‌లో జరిగిన టెస్టులో వీర్ ఆడిన ఇంగ్లీషు క్రికెటర్ ఆల్ఫ్ గోవర్ మరణం తర్వాత వీర్ 2001లో జీవించి ఉన్న అతి పెద్ద టెస్ట్ క్రికెటర్ గా నిలిచాడు. 2003లో ఆక్లాండ్‌లో మరణించాడు. భారత క్రికెట్ ఆటగాడు ఎం.జె. గోపాలన్ చేత ప్రపంచంలోని అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు.[1]

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.