తెలుగు రచయిత్రి From Wikipedia, the free encyclopedia
రేవూరి శోభాదేవి, తెలుగు భాషా రచయిత్రి. ఆమె పద కవితా పితామహుడు అన్నమయ్య జీవితం, భక్తి తత్వంపై పుస్తకాలు రచించడంతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన సాహితీవేత్త. [1]
రేవూరి శోభాదేవి | |
---|---|
జననం | శోభాదేవి 1950 మే 27 |
వృత్తి | రచయిత్రి |
జీవిత భాగస్వామి | రేవూరి అనంత పద్మనాభరావు |
ఆమె కారేడు గ్రామంలో మాతామహుల ఇంట 1950 మే 27న జన్మించింది. ఆమె విజయవాడ, రాజమండ్రి, బిట్రగుంటలో హైస్కూలు విద్య పూర్తి చేసింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో, నెల్లూరు లోని డి.కె.మహిళా కళాశాలలోనూ కళాశాల విద్యనభ్యసించింది. 1972లో డిగ్రీని పూర్తి చేసింది. 1969 మే 8న బిట్రగుంటలో అవధాని రేవూరి అనంతపద్మనాభరావు తో ఆమె వివాహం జరిగింది. ఆమె తిరుపతికి చెందిన రాజమోహన్ వద్ద సంగీతాన్ని అభ్యసించింది. భర్త రేవూరి అనంత పద్మనాభరావు [2]మార్గదర్శకత్వం, ప్రోత్సాహంతో సారస్వత అభిరుచిని మరింత పెంచుకున్న ఆమె తిరుపతి ప్రాంతంలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో సంకీర్తనల గాన శిక్షణ పొందింది. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని సాంస్కృతిక శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్ సాధించింది.
ఇతర రచనలు: ఆరాధన, సప్తగిరి, వేదాంతభేరి మాసపత్రికలలో ఆధ్యాత్మిక వ్యాసాలు
రేడియో ప్రసంగాలు: ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాదు, అనంతపురం కేంద్రాలలో ఉపన్యాసాలు.
Seamless Wikipedia browsing. On steroids.