Remove ads

రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి, సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

రేవతీ నక్షత్రాన్ని చూపే మీన రాశి చిత్రం

నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.

మరింత సమాచారం నక్షత్రం, అధిపతి ...
నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
రేవతిబుధుడుదేవపురుషఏనుగువిప్పఅంత్యనెమలిపూషణుడుమీనం
మూసివేయి
Remove ads

రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

మరింత సమాచారం తార నామం, తారలు ...
తార నామంతారలుఫలం
జన్మ తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిశరీరశ్రమ
సంపత్తారఅశ్విని, మఖ, మూలధన లాభం
విపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢకార్యహాని
సంపత్తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢక్షేమం
ప్రత్యక్ తారరోహిణి, హస్త, శ్రవణంప్రయత్న భంగం
సాధన తారమృగశిర, చిత్త, ధనిష్ఠకార్య సిద్ధి, శుభం
నైత్య తారఆరుద్ర, స్వాతి, శతభిషబంధనం
మిత్ర తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రసుఖం
అతిమిత్ర తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రసుఖం, లాభం
మూసివేయి

రేవతీనక్షత్రము నవాంశ

  • 1వ పాదము - ధనసురాశి.
  • 2వ పాదము - మకరరాశి.
  • 3వ పాదము - కుంభరాశి.
  • 4వ పాదము - మీనరాశి.

చిత్ర మాలిక

ఇతర వనరులు

రేవతి నక్షత్రము ప్రాశస్త్యము

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads