Remove ads

రేణుకాదేవి మహాత్మ్యం 1960 లో కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన పౌరాణిక చిత్రం.[1] ఇందులో గుమ్మడి, జి. వరలక్ష్మి, జగ్గయ్య, జమున తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇందులో పరశురామావతారం కథ ఆధారంగా తీసిన సినిమా.

త్వరిత వాస్తవాలు రేణుకాదేవి మహత్యం, దర్శకత్వం ...
రేణుకాదేవి మహత్యం
Thumb
దర్శకత్వంకె.ఎస్.ప్రకాశరావు
రచనడి. వి. నరసరాజు
నిర్మాతకె. ఎస్. ప్రకాశరావు
తారాగణంగుమ్మడి, జి. వరలక్ష్మి, జగ్గయ్య, జమున
ఛాయాగ్రహణంఎ. ఎస్. నారాయణ
కూర్పుఆర్. వి. రాజన్
సంగీతంఎల్. మల్లేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1960
భాషతెలుగు
మూసివేయి

కథ

రేణుకాసుడి కూతురు రేణుకాదేవి. ఈమె జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తుంది. ఆమె భక్తిశ్రద్ధలను గమనించిన జమదగ్ని మహర్షి ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి పరశురాముడితో సహా నలుగురు కుమారులు కలుగుతారు. ఆమె తన పాతివ్రత్య మహాత్మ్యంతో ఇసుక నుంచి కుండ తయారు చేసి అందులో పూజకు కావలసిన జలాలను తెస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆమె పవిత్రతకు భంగం కలగడంతో సకాలంలో నీళ్ళు తేలేకపోతుంది. జమదగ్ని మహర్షి ఆమెను కుష్టు రోగివి కమ్మని శపించి ఆశ్రమం నుంచి పంపించి వేస్తాడు. ఆమె గంగాదేవిని ప్రసన్నం చేసుకుని తన వ్యాధి రూపుమాపుకుంటుంది. కానీ జమదగ్ని మహర్షి మాత్రం ఆమెను ఆశ్రమంలోకి రానివ్వడు. అయినా ఆమె ఆశ్రమాన్ని వీడకపోవడంతో కుమారులను ఆమెకు శిరచ్ఛేదం చేయమంటాడు. మాతృహత్య మహాపాతకమని వారు అందుకు అంగీకరించకపోగా వారిని అగ్నిలో దహించివేస్తాడు.

కార్యవీర్యుడనే రాజు అధికార గర్వంతో ధర్మ శాస్త్రాలను కూడా తిరగరాస్తూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు.

Remove ads

తారాగణం

  • జమదగ్ని మహర్షిగా గుమ్మడి
  • జి. వరలక్ష్మి
  • కార్తవీర్యుడిగా రాజనాల
  • రమణా రెడ్డి
  • ఆదోని లక్ష్మి
  • మోహన
  • ఉదయం
  • రేణుకాసురుడిగా మిక్కిలినేని
  • శేషగిరి రావు
  • వేలంగి
  • అప్పారావు
  • రామమోహనరావు
  • ఆర్. వి. కృష్ణారావు
  • విశ్వనాధం
  • రమేష్
  • అతిథి పాత్రలో జమున
  • అతిథి పాత్రలో కృష్ణకుమారి
  • అతిథి పాత్రలో సూర్యకళ
  • అతిథి పాత్రలో శోభ
  • అతిథి పాత్రలో చంద్రికారాణి
  • శ్రీమహావిష్ణువు గా జగ్గయ్య
  • బాలయ్య
  • రమణమూర్తి
  • కె. వి. ఎస్. శర్మ
  • కృష్ణ
  • మహంకాళి వెంకయ్య

పాటలు

ఈ చిత్రంలో పాటలు, పద్యాలు ఆరుద్ర రచించాడు. ఎల్. మల్లేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించాడు. సుశీల, జానకి, జిక్కి, వైదేహి, ఘంటసాల, ఎ. ఎం. రాజా, పి. బి. శ్రీనివాస్, మాధవపెద్ది పాటలు పాడారు.

1.శ్రీ భక్త మందార శ్రిత పారిజాత , ఘంటసాల, రచన: ఆరుద్ర

2.ఓరీ హంతక ధర్మదాంద ఖలూడా ,(పద్యం), ఘంటసాల, రచన;ఆరుద్ర

3.మల్లోకమ్ముల నేందు దాగినను (పద్యం), ఘంటసాల, రచన; ఆరుద్ర

4.వచ్చినవాడు భార్గవు డవస్యము ,(పద్యం), ఘంటసాల, రచన; ఆరుద్ర

5.మాటున దాగి బాణముల (పద్యం) , ఘంటసాల, రచన; ఆరుద్ర

6.అందాలలోనే ఆనందముంది ఆనందమందే , జిక్కి, ఎ.ఎం రాజా , రచన: ఆరుద్ర

7 . ఆనందదాయి ఈసీమయేగా ఇలలో దివిని , పి.సుశీల , రచన: ఆరుద్ర

8.గంగాతరంగ రమణీయ జటాకలాపం(పద్యం), పి.సుశీల , రచన: ఆరుద్ర

9.జననీ జననీ పరమేశుని రాణి కరుణించు భవానీ, పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర

10.దేవుని మాయా తెలియగలేరు తెలుసుకొనినా, పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర

11.దేవా గంగాధరా మహాదేవా గంగాధరా, పి.సుశీల, రచన: ఆరుద్ర

12 . నాతో మార్కొనలేరు నిరర్జపతి నాగేంద్రపతి (పద్యం),మాధవపెద్ది సత్యం, రచన:ఆరుద్ర

13.నా పాపమేమీ మహాశాపమేల దయ నీకు రాదా, పి.సుశీల, రచన: ఆరుద్ర

14.మత్స్యావతారం మాధవుడెత్తగా(సంవాద పద్యాలు), పి సుశీల ,మాధవపెద్ది , రచన: ఆరుద్ర

15.వినువీధి నెలవంక ప్రభవించేరా , వైదేహి, రచన: ఆరుద్ర

16.శ్రీమంగళా గౌరీదేవి భవానీ(సుప్రభాతం), పి సుశీల , రచన: ఆరుద్ర

17.సద్గుణ నికురుంభా శాంభవి జగదాంబ (శ్లోకం), పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర

18.హర హరి శివ శివ నమామి దేవా అచల నివాస పరమేశా , పి బి శ్రీనివాస్, పి సుశీల, రచన:ఆరుద్ర

19.ఉదయించేను పాపాయి ముదమార లాలి నాపూజ ఫలియించే

20.ధన్యోస్మి ధన్యోస్మి దయామయి పావనీ ధన్యోస్మి , బృందం

21 నాచామ గోచార మనేక గుణ స్వరూపం నాగేశు(పద్యం).

Remove ads

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads