Remove ads
మేఘాలయ రాష్ట్రంలోని ఉత్తర గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, From Wikipedia, the free encyclopedia
రెసుబెల్పారా (రెసు), మేఘాలయ రాష్ట్రంలోని ఉత్తర గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] డామింగ్ నది పక్కన ఈ పట్టణం ఉంది.
రెసుబెల్పారా
రెసు | |
---|---|
నగరం | |
Coordinates: 25.8943300°N 90.5997800°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | ఉత్తర గారో హిల్స్ |
Government | |
• Body | రెసుబెల్పారా పురపాలక సంస్థ |
జనాభా (2001) | |
• Total | 17,652 |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 794108 |
టెలిఫోన్ కోడ్ | 913659 |
Vehicle registration | ఎంఎల్ - 13 |
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] రెసుబెల్పారా పట్టణంలో 17,652 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు పట్టణ సగటు అక్షరాస్యత రేటు 68% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 69% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
రెసుబెల్పారాలో రైల్వే స్టేషను ఉంది. సమీప విమానాశ్రయం గువహాటి నగరంలో ఉంది.
ఇక్కడ గారోలు, రభాలు నివసిస్తున్నారు.
ఇక్కడ ప్రతి ఏటా డిసెంబరు నెలలో ఎవ్ వింటర్ ఫెస్టివల్, మిలీనియం ఫెస్టివల్ జరుపుకుంటారు. డ్యాన్స్, రాక్ కన్సర్ట్, గేమ్స్, ఫ్యాషన్ షో వంటి పోటీలు ఇక్కడ నిర్వహించబడుతాయి. ప్రతి ఏటా సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు వంగల పండుగను జరుపుకుంటారు. "కట్టా డోక్కా", "అజియా", డాని డోక్కా చంబిల్ మో లేదా పోమెలో డాన్స్ మొదలైనవి ఈ పండుగ సందర్భంగా ప్రదర్శించబడతాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.