రూబియేసి (లాటిన్ Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
త్వరిత వాస్తవాలు రూబియేసి, Scientific classification ...
రూబియేసి |
|
Lady's Bedstraw (Galium verum) |
Scientific classification |
Kingdom: |
|
Division: |
|
Class: |
|
Order: |
|
Family: |
రూబియేసి
|
Type genus |
Rubia
|
ప్రజాతులు |
See text
For a full list, see: List of Rubiaceae genera |
మూసివేయి
- అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
- వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
- డైఖేసియల్ సైమ్ పుష్పవిన్యాసము.
- పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము.
- రక్షక పత్రాలు 4-5, సంయుక్తము.
- ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము.
- కేసరము 4-5, మకుట దళోపరిస్థితము.
- ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము.
- స్తంభ అండాన్యాసము.
- విత్తనము అంకురచ్ఛదయుతము.
- కాఫియా విత్తనాల నుండి కాఫీ పొడి లభిస్తుంది.
- సింకోనా బెరడులో క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని మలేరియా వైద్యంలో ఉపయోగిస్తారు.
- ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లభిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
- బండారు నుండి కలప లభిస్తుంది.
- మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
- అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.
- రూబియా (Rubia) : రూబియా కార్డిఫోలియా - మంజిష్ఠ
- కాఫియా (Coffea) : కాఫియా అరాబికా - కాఫీ
- సింకోనా (Cinchona) : సింకోనా అఫిసినాలిస్ - క్వినైన్
- ఆంథోసెఫాలస్ కదంబ - కదంబ
- హల్డినా - బండారు
- పావెట్ట కార్డిపోలియా - పాపిడి
- రాండియా - బలుసాకు
- ఇక్సోరా కాక్సీనియా - రామబాణం
- బొరీరియా హిస్పిడ - మదన
- సెఫీలిస్ ఇపికాచుయాన - ఇపికాక్
- మొరిండా టింక్టోరియా - తొగరు
- పన్నీరు పువ్వు
- బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.