రామ్ చరణ్

From Wikipedia, the free encyclopedia

రామ్ చరణ్

రామ్ చరణ్ (1939) భారతీయ-అమెరికన్ కన్సెల్టెంట్, వక్త, రచయిత. ప్రస్తుతం ఆయన టెక్సాస్ లోని డల్లాస్లో నివసిస్తున్నారు.[1]

Thumb
రామ్ చరణ్

కెరీర్

జి.ఇ, కె.ఎల్.ఎం, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ప్రాక్సర్, జయ్ పీ అసోసియేట్స్ వంటి కంపెనీలతో కన్సల్టేషన్ చేశారు చరణ్. వ్యాపార రంగంపై టాలెంట్ మాస్టర్స్, లీడర్స్ ఎట్ ఆల్ లెవెల్స్, లీడర్ షిప్ ఇన్ ది ఎరా ఆఫ్ ఎకనామిక్ అన్ సర్టెనిటీ, ది న్యూ రూల్స్ ఫర్ గెట్టింగ్ ది రైట్ థింగ్స్ డన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్, బోర్డ్స్ ఎట్ వర్క్, ఎవ్రీ బిజినెస్ ఈజ్ ఎ గ్రోత్ బిజినెస్, ప్రాఫిటబుల్ గ్రోత్ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్, కన్ఫ్రంటింగ్ రియాలిటీ, నో హౌ ది ఎగ్జిక్యూషన్ వంటి ప్రముఖ పుస్తకాలు రాశారు రామ్. వీటిలో లారీ బస్సిడీ, చార్లెస్ బర్క్ తో కలసి రాసిన నో హౌ ది ఎగ్జిక్యూషన్ పుస్తకం ఆయన రచనల్లో ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం.[2]

డల్లాస్ లో చరణ్ అసోసియేట్స్ పేరుతో వ్యాపార నిర్వహణ కన్సల్టింగ్ సంస్థను నిర్వహిస్తున్నారు ఆయన. టిఎక్స్ రికార్డుల ప్రకారం ఈ సంస్థను 1981న టెక్సాస్ లో ప్రారంభించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ సంస్థ సంవత్సర ఆదాయం 500,000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్ల వరకు ఉంది.[3] ఆస్టిన్ ఇండస్ట్రీస్, ఎస్.ఎస్.ఎ & కంపెనీ, టి.ఇ కనెక్టివిటీ సంస్థల బోర్డుల్లో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు చరణ్.[4][5]

ఆక్యుమెన్ లెర్నింగ్ ను ప్రారంభించడానికి కెవిన్ ఆర్.కోప్, స్టీఫెన్ ఎం.ఆర్.కోవేలతో కలసి పార్టనర్ షిప్ చేశారు చరణ్. వాట్ ది సి.ఈ.వో వాంట్స్ యు టు నో అనే పుస్తకంలో ఈ ఆక్యుమెన్ లెర్నింగ్ సిద్ధాంతాల గురించి రాశారు ఆయన.[6] 

నవంబరు 2012లో సద్గురు జగ్గీ వాసుదేవ్ తో కలసి ప్రొఫెషనల్, వ్యక్తిగత సాధికారత గురించి కలిపి మొట్టమొదటిసారిగా ఒక నాయకత్వ కార్యక్రమం నిర్వహించారు చరణ్. ఆయనను ఫార్చ్యూన్ పత్రిక అత్యంత ప్రభావవంతమైన జీవించి ఉన్న కన్సల్టెంట్ గా పేర్కొంది. ఇషా యోగా సెంటర్ లో 200 మంది వ్యాపారవేత్తలకు ఆధ్యాత్మిక, వ్యాపార విషయాలను కలిపి ఎలా ఉంచాలనే 4 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు చరణ్.

2000లో జాతీయ మానవ వనరుల అకాడమీకి ఫెలోగా ఎన్నికయ్యారు చరణ్. 2005న ఆయనను డిస్టింగ్విష్డ్ ఫెలోగా పేర్కొన్నారు. 2010 ఫిబ్రవరిలో ఒక నెలరోజుల పాటు భారతదేశంలో దాదాపు 400మంది భారత సి.ఈ.వోలకు ప్రెజంటేషన్ ఇచ్చారు ఆయన.

అవార్డులు

  • మే 17 2010న ది అమెరికన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డవలప్ మెంట్ చరణ్ కు చాంపియన్ ఆఫ్ వర్క్ ప్లేస్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ప్రరస్కారంతో గౌరవించింది.[7]
  • ఎకనమిక్ టైమ్స్ పత్రిక చరణ్ ను గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2010గా పేర్కొంది.[8]
  • థింకర్స్ 50[9]

రచనలు

  • ది టాలెంట్ మాస్టర్స్: వై స్మార్ట్ లీడర్స్ పుట్ పీపుల్ బిఫోర్ నెంబర్స్ (9 నవంబరు 2010)
  • ఓనింగ్ అప్: ది 14 క్వశ్చెన్స్ ఎవ్రీ బోర్డ్ మెంబర్ నీడ్స్ టు  ఆస్క్ (ఏప్రిల్ 13, 2009)
  • లీడర్ షిప్ ఇన్ ది ఎరా ఆఫ్ ఎకనమిక్ అన్ సర్టెనిటీ: ది న్యూ రూల్స్ ఫర్ గెట్టింగ్ ది రైట్ థింగ్స్ డన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ (డిసెంబరు 22, 2008)
  • ది గేమ్ చేంజర్:హౌ యూ కెన్ డ్రైవ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ విత్ ఇన్నోవేషన్ (ఏప్రిల్ 8, 2008)
  • నో-హౌ:ది 8 స్కిల్స్ దట్ సెపరేట్ పీపుల్ హూ పెర్ఫార్ం ఫ్రమ్ దోజ్ హూ డోంట్ (2007)
  • లీడర్స్ ఎట్ ఆల్ లెవెల్స్:డీపెనింగ్ యువర్ టాలెంట్ పూల్ టు సాల్వ్  ది సక్సెషన్ క్రైసిస్ (డిసెంబరు 21, 2007)
  • వాట్ ది కస్టమర్ వాంట్స్ యూ టు నో (డిసెంబరు 27, 2007)
  • బోర్డ్స్ దట్ డెలివర్:ఎడ్వాన్సింగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రమ్ కంప్లైన్స్ టు కంపిటీటివ్ ఎడ్వాంటేజ్ (2005)
  • ది సోర్స్ ఆఫ్ సక్సెస్:ఫైవ్ ఎండ్ర్యూరింగ్ ప్రిన్సిపల్స్ ఎట్ ది హార్ట్ ఆఫ్ రియల్ లీడర్ షిప్ (2005)
  • కన్ఫ్రంటింగ్ రియాలిటీ:డూయింగ్ వాట్ మేటర్స్ టు గెట్ థింగ్స్ రైట్ (2004)
  • ప్రాఫిటబుల్ గ్రోత్ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్:10 టూల్స్ యూ కెన్ యూజ్ మండే మార్నింగ్ (2004)
  • ఎగ్జిక్యూషన్:ది డిసెప్లైన్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ (2002)
  • వాట్ ది సి.ఈ.వో వాంట్స్ యూ టు నో:హౌ యువర్ కంపెనీ రియల్లీ వర్క్స్ (2001)
  • ది లీడర్ షిప్ పైప్ లైన్: హౌ టు బిల్డ్ ది లీడర్ షిప్ పవర్డ్ కంపెనీ (2000)
  • ఎవ్రీ బిజినెస్ ఈజ్ గ్రోత్ బిజినెస్:హౌ యువర్ కంపెనీ కేన్ ప్రాస్పర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ (2000)

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.