Remove ads
From Wikipedia, the free encyclopedia
శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. 1979లో చెన్నైలో పి.వి.రమణయ్య రాజా అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ రాజా లక్ష్మీ అవార్డు అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన తెలుగు కళా సమితి (TFAS) నుండి డా. కె. వి. రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.
రాజా-లక్ష్మీ అవార్డు | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం వైద్యం, సమాజ సేవ | |
వ్యవస్థాపిత | 1979 | |
మొదటి బహూకరణ | 1979 | |
క్రితం బహూకరణ | 2007 | |
మొత్తం బహూకరణలు | 29 | |
బహూకరించేవారు | శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ | |
నగదు బహుమతి | లక్ష రూపాయలు | |
మొదటి గ్రహీత(లు) | శ్రీశ్రీ | |
క్రితం గ్రహీత(లు) | డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్ |
రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" (1987-1999), "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా ప్రారంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగస్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబరు 19న బహూకరిస్తారు. ఐ.ఐ.టి. మద్రాస్ M. Sc. Chemistryలో ఉత్తమ విద్యార్థికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.
2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు కోనేరు హంపికి, ఆచంట శరత్ కమల్‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.
క్రమ సంఖ్య | సంవత్సరం | ప్రచురణ పేరు | రచయిత |
---|---|---|---|
01 | 1985 | భజ గోవిందం | డా.పప్పు వేణుగోపాలరావు |
02 | 1986 | సుందర కాండము | ఉషశ్రీ |
03 | 1987 | లీలా కృష్ణుడు | ఇంద్రగంటి శ్రీకాంత శర్మ |
04 | 1988 | నిత్యార్చన | డా.పప్పు వేణుగోపాలరావు |
05 | 1990 | శ్రీ మాత | శ్రీ మాతాజీ త్యాగీశానందపురి |
06 | 1992 | ఆత్మ బోధ | కరిదేహల్ వెంకటరావు |
07 | 1996 | సనత్సు జాతీయ సౌరభం | ప్రొ.సలాక రఘునాధ శర్మ |
08 | 2000 | శివానంద లహరి హంస | ప్రొ.సలాక రఘునాధ శర్మ |
09 | 2006 | ప్రతిభా పంచామృతం | రాంభట్ల నృసింహ శర్మ |
10 | 2006 | రామదాసు, త్యాగరాజు | ప్రొ.ఎ.ప్రసన్నకుమార్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.