రథం
From Wikipedia, the free encyclopedia
రథం 2018లో విడుదలైన తెలుగు సినిమా. రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించాడు.[1] గీత ఆనంద్, చాందిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 అక్టోబర్ 2018న విడుదలైంది.[2][3]
కథ
కార్తీక్ (గీతానంద్) తల్లిదండ్రులతో వుంటూ వ్యవసాయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ చదువుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఫ్యాక్షన్ నేత అబ్బులు కూతురు బుజ్జి (చాందినీ భగ్వనాని) ప్రేమలో పడుతాడు, కానీ అబ్బులు తన కూతురు ప్రేమను అంగీకరించడు. వారిని ప్రేమను అంగీకరించడానికి అబ్బులు పెట్టిన షరతులు ఏమిటి? వాటిని ఎదురుకొని కార్తీక్, బుజ్జి ఒక్కటయ్యారా అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: రాజగురు ఫిలిమ్స్
- నిర్మాత: రాజా దారపునేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి
- సంగీతం: సుకుమార్ పమ్మీ
- సినిమాటోగ్రఫీ: సునీల్ ముత్యాల
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నివాశర్మ
- ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.