అన్ని సముద్రాలలో తీర ప్రాంతము, లోతు జలాలలో జీవిస్తున్నాయి.
ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు, కొన్ని ప్లవక జీవులు.
ఇవి సరళంగా లేక సహనివేశాలుగా ఉంటాయి.
ఇవి వివిధ పరిమాణాలలో (0.25 నుండి 250 మి.మీ.), ఆకారము, వర్ణాలలో ఉంటాయి.
డింభక దశ సంక్లిష్టంగా ఉండి ప్రౌఢదశ సరళంగా ఉంటుంది.
శరీరాన్ని కప్పుతూ సెల్యులోస్ వంటి పదార్ధమైన ట్యునిసిన్ (Tunicin) రక్షణ కొరకు, కవచము లేక కంచుకముగా ఏర్పడి ఉంటుంది. అందువలన "ట్యునికేటా" అని పేరు వచ్చింది.
జలశ్వాస, పృష్ట ఆట్రియల్ రంధ్రము ఉంటాయి.
శరీర కుహరము ఉండదు. కాని బహిస్త్వచముతో చుట్టబడిన ఆట్రియల్ కుహరము వెలుపలికి ఆట్రియల్ రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది.
పృష్టవంశము డింభకదశలో తోక భాగమునకు పరిమితమై ప్రౌఢదశలో లోపించి ఉంటుంది. అందువలన "యూరో కార్డేటా" అను పేరు వచ్చింది.
జీర్ణనాళములో గ్రసని (జలశ్వాసగోణి) ఎండోస్తైల్ తో కూడి అనేక జతల మొప్ప చీలికలను కలిగివుంటుంది.