యుఁఆన్‌ చ్వాంగ్‌ లేదా యుఁవాన్‌ త్స్యాంగ్‌ (చైనీస్: 玄奘; ఆంగ్లం: Xuanzang, Chen Hui or Chen Yi, (జ: 602 - మ: 664) చైనాకు చెందిన బౌద్ధభిక్షువు, పండితుడు, యాత్రికుడు, అనువాదకుడు. ఇతడు భారతీయ, చైనీయుల బౌద్ధమతాల పరస్పర సంబంధాన్ని టాంగ్ రాజవంశం కాలంలో వర్ణించాడు. చిన్నతనం నుండి చైనాకు సంబంధించిన మతసంబంధమైన పుస్తకాలను చదవడంలో చాలా శ్రద్ధ చూపించేవాడు.

త్వరిత వాస్తవాలు యుఁఆన్‌ చ్వాంగ్‌Xuanzang, వ్యక్తిగతం ...
యుఁఆన్‌ చ్వాంగ్‌
Xuanzang
Thumb
A portrait of Xuanzang
వ్యక్తిగతం
జననంc. 602
Luoyang, Henan, చైనా
మరణం664 (aged 62)
Tongchuan, Shaanxi, చైనా
మతంబౌద్ధం
పాఠశాలEast Asian Yogācāra
Senior posting
Students
  • Kuiji
మూసివేయి

జీవితచరిత్ర, ఆత్మకథ

రాజుగారి కోరిక మేరకు సా.శ. 646 సంవత్సరంలో యుఁఆన్‌ చ్వాంగ్‌ తన గ్రంథం Great Tang Records on the Western Regions (大唐西域記) ను పూర్తిచేశాడు. ఇది మధ్యయుగంలోని ఆసియా, భారతదేశపు విశేషాలను తెలియజేసే ప్రధాన వనరు.[1] దీనిని 1857లో స్టానిస్లాస్ జూలియన్ (Stanislas Julien) ఫ్రెంచి భాష లోనికి అనువదించాడు. ఇతని జీవితచరిత్రను బౌద్ధ భిక్షువు హూలీ (Huili; 慧立) రచించాడు. ఈ రెండు పుస్తకాల్ని సామ్యూల్ బీల్ (Samuel Beal) (1825-1889) ఆంగ్ల భాషలోని అనువదించగా; అతని మరణానంతరం 1905 లో అవి ముద్రించబడ్డాయి.

రచనలు

  • Watters, Thomas (1904). On Yuan Chwang's Travels in India, 629-645 A.D. Vol.1. Royal Asiatic Society, London. Volume 2. Reprint. Hesperides Press, 1996. ISBN 978-1-4067-1387-9.
  • Beal, Samuel (1884). Si-Yu-Ki: Buddhist Records of the Western World, by Hiuen Tsiang. 2 vols. Translated by Samuel Beal. London. 1884. Reprint: Delhi. Oriental Books Reprint Corporation. 1969. Vol. 1, Vol. 2
  • Julien, Stanislas, (1857/1858). Mémoires sur les contrées occidentales, L'Imprimerie impériale, Paris. Vol.1 Vol.2
  • Li, Rongxi (translator) (1995). The Great Tang Dynasty Record of the Western Regions. Numata Center for Buddhist Translation and Research. Berkeley, California. ISBN 1-886439-02-8

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.