యసుటారో కొయిడే

జపాన్ వయోవృద్ధులు From Wikipedia, the free encyclopedia

యసుటారో కొయిడే

యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించిన జపాన్ కురువృద్ధుడు. రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొన్ని నెలల ముందు ఆయన జన్మించారని, అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నారని తెలిపారు.

త్వరిత వాస్తవాలు యసుటారో కొయిడే, జననం ...
యసుటారో కొయిడే
小出 保太郎
Thumb
జననంమార్చి 13, 1903
సురుగ,జపాన్
మరణంజనవరి 19, 2016
(వయస్సు 112 సంవత్సరాలు, 312 రోజులు)
నగోయా, జపాన్
మరణ కారణంగుండె జబ్బు
జాతీయతజపనీయుడు
వీటికి ప్రసిద్ధిప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తి (జూలై 5, 2015 – జనవరి 19, 2016)
పిల్లలు7 పిల్లలు
బంధువులు
  • 9 మునిమనుమలు
  • 1 గ్రేట్ గ్రాండ్ చైల్డ్
మూసివేయి

జీవిత విశేషాలు

ఆయన 1903, మార్చి 13న జన్మించారు. దర్జీగా ఒక బట్టల దుకాణంలో పనిచేసారు.[1] తన 107వ యేట నగోయా ప్రాంతానికి తన కుమార్తె వద్ద నివసించడానికి వెళ్లారు.[2] ఆయనకు 110 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన వార్తాపత్రికలను కళ్ళద్దాలు లేకుండా చదువగలిగేవారు. కట్టుడు పళ్ళు లేకుండా స్వంత దంతాలతో ఆహారం నమిలి తినేవారు.[3] ఐచి ప్రెఫెక్టర్ లో ఆయన ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా "నగోయా" సహచరుడు అయిన "త్సూయ మియురా" తన 111 వ యేట మరణించిన తరువాత మార్చి 31, 2014 న చరిత్రలో నిలిచారు.[4]

ఆగష్టు 21, 2015 న అద్యధిక కాలం జీవించిన వ్యక్తిగా అధికారికంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.[1] కొయిడె దీర్ఘాయుష్షుకు రహస్యమేమిటీ అని గతంలో ఆయనను పలువురు అడిగేవారట. అందుకు ఆయన చిరునవ్వుతో చెప్పిన జవాబేమిటంటే... ‘శక్తికి మించి పనిచేయవద్దు... ఆనందంగా జీవించాలి’ అని. ప్రపంచ దేశాల్లో జపాను వాసులే దీర్ఘాయుష్కులుగా ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడి జనాభాలో నాలుగో వంతు 65 ఏళ్లు పైబడిన వారే.[2]

ఆయన జనవరి 19 2016 న గుండె పనితీరులో లోపం వల్ల నగోరా లోని ఆసుపత్రిలో మరణించారు.[5]

మూలాలు

ఇతర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.