మోహనాంగి

From Wikipedia, the free encyclopedia

Remove ads
Remove ads

మోహనాంగి శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె. ఆమె "మరీచి పరిణయము" అను మహాకావ్యమును రచించెను.[1] ఈమె తన గ్రంధమందు రాయల కాలమునాటి చారిత్రక సత్యములెన్నింటినో విశదపరచి నేటి చరిత్ర పరిశోధకులకు సహాయకారియైనది. ఈమె రాసిన కావ్యం ఉపలబ్దము. కానీ ఈ మధ్యనే ఈ కావ్య పీఠిక మాత్రము లభించి ప్రచురింపబడినది . "ఈ పీఠికను గాంచినచో నింతవరకు శ్రీకృష్ణ దేవరాయలను గూర్చి అనుస్యూతముగా మనము వినుచున్న ఎన్నో చారిత్రక విషయములను గూర్చి మనము అభిప్రాయములను మార్చుకొనవలసి వచ్చుచున్నదని పండితులు అభిప్రాయపడుతున్నారు. "- అని ఊటుకూరి లక్షీకాంతమ్మ తెలుగు కవయిత్రులు, తెలుగు వాణి, పుట 194, ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 1975లో అభిప్రాయపడి ఉన్నారు.

మరీచి మరిణయం గ్రంథములో అమె "స్త్రీలనన్నంతనె చుల్కనజేయుట కుమారీ మౌఢ్యమేసుమ్ము నారీలోకంబున శేముషీయుతలు లేరే, పూర్వమింతేటికిన్" అంటూ మహిళా రచనలపై తనకుగల అభిమానమును వ్యక్తపరచుటేగాక ఆ గ్రంధమునకు తాను పతిగా కృతి పతిత్లమునంగీకరింతునని కూడా ఎన్నియో చమత్కారాలతో చెప్పెను. ఈమె రచయిత్రియేగాక చిత్రలేఖన, కావ్య రచన కళలో కూడా ప్రవీణురాలని చరిత్ర చెప్పుచున్నది.

Remove ads

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads