Remove ads
నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ముఖ్య పట్టణం, పట్టణ ప్రాంత కమిటీ. From Wikipedia, the free encyclopedia
మోన్, నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ముఖ్య పట్టణం, పట్టణ ప్రాంత కమిటీ.
మోన్ పట్టణం 26.75°N 95.1°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 655 మీటర్ల (2,148 అడుగుల) ఎత్తులో ఉంది.
ఈ పట్టణం, కోహిమా నుండి దీమాపూర్ మీదుగా 357 కి.మీ.ల దూరంలో, దీమాపూర్ నుండి 280 కి.మీ.ల దూరంలో, కోహిమా నుండి మొకొక్ఛుంగ్ మీదుగా 275 కి.మీ.ల దూరంలో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మోన్ పట్టణంలో 16,590 జనాభా ఉంది. ఇందులో 9,138 మంది పురుషులు, 7,452 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, ఇది జాతీయ సగటు 76% కన్నా కొద్దిగా తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇక్కడ కొన్యాక్స్, అయోస్ రెండు తెగలు నివాసితులుగా ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.