Remove ads

మొరేనా మధ్య ప్రదేశ్ రాష్ట్రం, మొరేనా జిల్లా లోని పట్తణం, ఈ జిల్లా ముఖ్యపట్తణం. ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నుండి 39 కి.మీ.దూరంలో ఉంది. మొరేనా ఒకప్పుడు పెద్ద సంఖ్యలో బందిపోట్ల వలన భయభ్రాంతులకు గురైంది. బింద్, మొరేనాకు పొరుగున ఉన్న పట్టణం. మొరేనా పారిశ్రామిక కేంద్రం. కానీ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. మొరేనాలో అనేక తయారీ పరిశ్రమలు ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు మొరేనా మురైనా, దేశం ...
మొరేనా
మురైనా
పట్టణం
Thumb
చౌసత్ యోగిని ఆలయం, మొరేనా
Nickname: 
మయూర్‌వన్
Thumb
మొరేనా
మొరేనా
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26.5°N 78.0°E / 26.5; 78.0
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లామొరేనా
విస్తీర్ణం
  Total80 కి.మీ2 (30 చ. మై)
Elevation
177 మీ (581 అ.)
జనాభా
 (2011)[1]
  Total2,00,483
  Rank154
  జనసాంద్రత2,500/కి.మీ2 (6,500/చ. మై.)
భాషలు
  అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
476001
టెలిఫోన్ కోడ్07532
Vehicle registrationMP-06
మూసివేయి

భౌగోళికం

మొరేనా 26.5°N 78.0°E / 26.5; 78.0 నిర్దేశాంకాల వద్ద, [2] సముద్ర మట్టం నుండి 177 మీటర్ల ఎత్తున ఉంది.

ఇక్కడి నుండి రైలు మార్గం, జాతీయ రహదారి ద్వారా గ్వాలియర్, ఆగ్రాతో సంబంధాలున్నాయి. నూనెగింజల మిల్లింగ్, పత్తి నేయడం ఇక్కడి ప్రధాన పరిశ్రమలు. నగరంలో జివాజీ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా మూడు కళాశాలలు, ఆర్జీపీవీ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా రెండు కళాశాలలు ఉన్నాయి.

గోధుమలు, నూనె గింజలు ఇక్కడి ప్రధాన పంటలు. నిర్మాణ రాయి క్వారీలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి మొరేనా నెమళ్లకు ప్రసిద్ధి చెందింది  (2001 లో 1,50,959). అందువలన పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని మయూర్ వన్ అని కూడా పిలిచేవారు.

Remove ads

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం, మొరేనా జనాభా 2,88,303. జనాభాలో 13.2% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. అక్షరాస్యత 80.28%; పురుషుల అక్షరాస్యత 89.08%, స్త్రీల అక్షరాస్యత 70.22%.

రవాణా సౌకర్యాలు

రోడ్లు

మొరేనా జాతీయ రహదారి 3 పై ఉంది . ఈ రహదారి ద్వారా మొరేనా నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, సమీప రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లకు రోడ్డు సౌకర్యం కలిగింది. సమీప పట్టణాలు, గ్రామాలు, నగరాలకు బస్సు సేవలు ఉన్నాయి. మొరేనా నుండి ఆగ్రా, ఢిల్లీ, గ్వాలియర్, ఇండోర్, ముంబై, భోపాల్ వంటి నగరాలకు బస్సులు నడుస్తాయి.

భారత రైల్వే

మొరేనా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, జైపూర్, ఇండోర్ తదితర ప్రధాన నగరాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ళున్నాయి. భోపాల్ ఎక్స్‌ప్రెస్, తాజ్ ఎక్స్‌ప్రెస్, భోపాల్ శతాబ్ది వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా, ఇంకా ఇతర రైళ్ళు మొరేనా వద్ద ఆగుతాయి.

Remove ads

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads