From Wikipedia, the free encyclopedia
డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్ఫ్లూయన్సర్.[2] ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.[3]
మైనంపల్లి రోహిత్ రావు | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 03 డిసెంబర్ 2023 నుండి ప్రస్తుతం | |||
ముందు | పద్మా దేవేందర్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మెదక్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1 నవంబర్1997 హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | వాణి, మైనంపల్లి హన్మంతరావు | ||
జీవిత భాగస్వామి | శివాని రెడ్డి[1] | ||
బంధువులు | మైనంపల్లి శివాంక్ | ||
సంతానం | క్రియన్ష్ | ||
నివాసం | అశోక బిల్డర్స్ , దూలపల్లి , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా | ||
వృత్తి | డాక్టర్, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్ఫ్లూయన్సర్ |
మైనంపల్లి రోహిత్ 1997 నవంబరు 1 న హైదరాబాద్ లో మైనంపల్లి హన్మంతరావు[4], వాణి దంపతులకు జన్మించాడు.[5] ఆయన మేడ్చల్ లోని మెడిసిటీ వైద్య కళాశాల నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసి రెండు బంగారు పతకాలను అందుకున్నాడు.[6][7]
మైనంపల్లి రోహిత్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనా సమయంలో నిరుపేదలకు తన సంస్థ ద్వారా ఆర్థిక, నిత్యావసరాలను అందజేశాడు.[8][9][10] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[11][12][13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.