From Wikipedia, the free encyclopedia
మెదడు వాపు (మెనింజైటిస్) అనేది మెదడు, వెన్నుపూసను కప్పి ఉంచే రక్షిత పొరల యొక్క తీవ్రమైన వాపు, దీనిని సమిష్టిగా మెనింజెస్ అని పిలుస్తారు.[1] జ్వరం, తలనొప్పి, మెడ బిగుసుకుపోవటం అనేవి దీని యొక్క సర్వసాధారణ లక్షణాలు. ఇతర లక్షణాలలో గందరగోళం లేదా స్మారక స్థితిలో మార్పు, వాంతులు, కాంతిని లేదా పెద్ద శబ్దాలను భరించలేకపోవడం అనేవి ఉంటాయి.[2] చిన్నపిల్లలలో తరచుగా చిరాకు, నిద్రమత్తు లేదా ఆహారంపై తక్కువ ఆసక్తి చూపటం వంటి నిర్ధిష్టత లేని లక్షణాలు మాత్రమే కనబడతాయి.దద్దుర్లు ఉంటే, అది మెదడు వాపుకు ప్రత్యేక కారణంగా సూచించబడవచ్చు; ఉదాహరణకు, మెనింగోకాకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే మెదడు వాపు, దద్దుర్లుతో కూడిన లక్షణాన్ని కలిగియుండవచ్చు.[1][3]
వైరసులు, బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులతో ఇన్ఫెక్షన్ వల్ల వాపు సంభవించవచ్చు, సాధారణంగా కొన్ని రకాల మందుల ద్వారా తక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు.[4] మెదడు, వెన్నుపూసకు సమీపంలో వాపు ఉన్న కారణంగా మెదడు వాపు వ్యాధి ప్రాణాంతకమవుతుంది; అందువల్ల, ఈ పరిస్థితి అత్యవసర వైద్య పరిస్థితిగా వర్గీకరించబడింది.[1][5] కటి పంక్చర్ మెదడువాపును నిర్ధారిస్తుంది లేదా మినహాయిస్తుంది.[2] మెదడు, వెన్నుపామును ఆవరించియుండే ద్రవం (సిఎస్ఎఫ్) యొక్క నమూనాను సేకరించడానికి వెన్నెముక మార్గంలోకి ఒక సూది చొప్పించబడుతుంది. సిఎస్ఎఫ్ను వైద్య ప్రయోగశాలలో పరీక్షిస్తారు.[5]
మెనింజోకాకల్, గవదబిళ్ళలు, న్యుమోకాకల్, హిబ్ వ్యాక్సిన్లతో వ్యాధి నిరోధక శక్తిని కలిగించుట ద్వారా కొన్ని రకాల మెదడు వాపులు నివారించబడతాయి.[1] కొన్ని రకాల మెదడు వాపులకు గణనీయంగా గురయ్యే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.[2] తీవ్రమైన మెదడువాపు ఇచ్చే మొదటి చికిత్సలో తక్షణం యాంటీబయాటిక్స్ ఇవ్వటం, కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇవ్వడం జరుగుతుంది.[2][6] అతి ఎక్కువ వాపు ద్వారా వచ్చే సమస్యలను నివారించడానికి కూడా కార్టికోస్టెరాయిడ్స్ను ఉపయోగించవచ్చు.[3][5] మెదడువాపుకు ప్రత్యేకించి వెంటనే చికిత్స చేయకపోతే అది చెవిటితనం, మూర్ఛ, హైడ్రోసెఫాలస్ (మెదడులో ద్రవం పేరుకుపోవటం) లేదా మానసిక ప్రక్రియలలో లోపాల వంటి తీవ్రమైన దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుంది.[1][3]
2013 లో మెనింజైటిస్ సుమారు 16 మిలియన్ల మందిలో సంభవించింది.[7] దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1990 లో 464,000 మరణాలు సంభవించగా, ఈ సంవత్సరం అది తగ్గి 303,000 మరణాలు సంభవించాయి. [8]తగిన చికిత్సతో బాక్టీరియల్ మెనింజైటిస్లో మరణించే ప్రమాదం 15% కన్నా తక్కువగా ఉంది.[2] మెనింజైటిస్ బెల్ట్ అని పిలువబడే ఉప-సహారా ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం డిసెంబర్, జూన్ మధ్య బ్యాక్టీరియా మెదడు వాపు విజృంభణ జరుగుతుంది.[9] ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా కొంత విజృంభణ సంభవించవచ్చు. మెనింజైటిస్ అనే పదం గ్రీకు నుండి "మెమ్బ్రేన్", మెడికల్ ప్రత్యయం -ఇటిస్, "ఇన్ఫ్లమేషన్" నుండి వచ్చింది.[10][11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.