మురమళ్ళ
ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
మురమళ్ళ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామం.[2].
మురమళ్ళ | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°40′15.996″N 82°10′10.992″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | ఐ.పోలవరం |
విస్తీర్ణం | 4.48 కి.మీ2 (1.73 చ. మై) |
జనాభా (2011) | 5,390 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,729 |
• స్త్రీలు | 2,661 |
• లింగ నిష్పత్తి | 975 |
• నివాసాలు | 1,554 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 533220 |
2011 జనగణన కోడ్ | 587749 |
ఇది మండల కేంద్రమైన I. పోలవరం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.మురమళ్ళ, అమలాపురం నుండి 25 కి.మీ., కాకినాడ నుండి 38 కి.మీ., (వయా యానాం), రాజమహేంద్రవరం నుండి 105 కి.మీ. (రావులపాలెం ద్వారా) దూరంలో ఉంది. మురమళ్ళ గ్రామం మేజర్ పంచాయితీ, ఇది ముమ్మిడివరం మండలం సమీపంగా ఉంది.
గౌతమీ తీర గ్రామమైన ఈ ప్రదేశంలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారని అందువలన ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చింది. అది కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,822.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,429, మహిళల సంఖ్య 2,393, గ్రామంలో నివాస గృహాలు 1,187 ఉన్నాయి.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1554 ఇళ్లతో, 5390 జనాభాతో 448 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2729, ఆడవారి సంఖ్య 2661. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 961 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 18. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587749.[4].
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఐ.పోలవరంలోను, ఇంజనీరింగ్ కళాశాల ముమ్మిడివరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ ముక్తేశ్వరంలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అమలాపురంలో ఉన్నాయి.
మురామళ్ళలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు,
ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
మురామళ్ళలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. కాకినాడ, అమలాపురం నుండి అనేకం బస్సులు నడుస్తాయి. రాజమహేంద్రవరం నుండి బస్సులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. కత్తిపూడి - పామర్రు నుండి జాతీయ రహదారి 214 మధ్య ఉన్న మురమళ్ళ గ్రామం ఉంది. గోదావరి ఉపనది అయిన గౌతమి నది మీద కొత్తగా నిర్మించి, ప్రారంభించిన జిఎమ్‌సి బాలయోగి వారధి ద్వారా ప్రతి ఒక బస్సు లేదా ఏ ఇతర వాహనములు అయినా ఈ గ్రామం గుండా వెళ్ళుతాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
మురామళ్ళలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
మురామళ్ళలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
మురామళ్ళలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు . దీనితోపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి రోజు evening 05 గం.ల నుండి స్వామి కల్యాణములు చేయబడుతాయి.
దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను. భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను. అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుత చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయింది. అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ధ శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చింది. తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను. అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామంన ఒక ప్రదేశానికి రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్ఠా కార్యక్రమములు నిర్వహించిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.