From Wikipedia, the free encyclopedia
మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది.
మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియాలో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.
మౌలిద్ అనేపదం అరబ్బీ మూల పదం' ولد ' ( వల్ద్ ), అనగా 'జన్మనిచ్చు' 'సృష్టించు'. సమకాలీన వ్యవహారంలో 'మౌలిద్' 'మీలాద్-ఉన్-నబి' కు ప్రతిరూపం.[1]
దీనికి ఇతరపేర్లు క్రింది విధంగానూ వున్నాయి :
ఇస్లామీయ కేలండర్ లోని రబీఉల్-అవ్వల్ నెల పన్నెండవతేదీన ఈ పర్వము వస్తుంది. ఇస్లామీయ కేలండరు చాంద్రమాన కేలండర్, దీనికి సరియగు గ్రెగోరియన్ కేలండర్ తేదీలు క్రింది ఇవ్వబడినవి.
గ్రెగోరియన్ సంవత్సరం | 12వ తేదీ, రబీఉల్ అవ్వల్ (సున్నీ ఇస్లాం) ! | |
---|---|---|
2007* | మార్చి 31 | |
2008 | మార్చి 20 | |
2009 | మార్చి 9 | |
2010 | ఫిబ్రవరి 26 | |
2011 | ఫిబ్రవరి 15 | |
2012 | ఫిబ్రవరి 4 | |
2013 | జనవరి 24 | |
2014 | జనవరి 14 | |
* ధృవీకరించడమైనది. అన్ని భవిష్యత్తు తారీఖులు, గ్రెగోరియన్, ఇస్లామీయ కేలండర్ ననుసరించి ధృవీకరించబడినవి. కాని ఇవన్నియూ క్రొత్తనెల చంద్రవంక చూసినతరువాత మాత్రమే స్థిరీకరించబడుతాయి. |
అబ్బాసీయ ఖలీఫా హారూన్ అల్-రషీద్ తల్లి 'అల్-ఖైజురన్', తన కాలంలో ఇస్లామీయ ప్రవక్త యగు ముహమ్మద్ యొక్క జన్మతిథిని పునస్కరించుకొని, మౌలీద్ షరీఫ్ (ప్రవక్త జయంతి ఉత్సవాలు) ప్రారంభించింది. ముహమ్మద్ ప్రవక్త జన్మించిన ఇంటిని, ఖైజురన్, ఓ ప్రార్థనాలయంగా మార్పు చేసింది.[3] ముహమ్మద్ ప్రవక్త పరమదించిన నాలుగు శతాబ్దాలవరకూ, జన్మదినోత్సవాన్ని ఎవరూ జరుపుకున్నట్లు ఆధారాలు లభించలేదు. తరువాతనే ఇవి ఈజిప్టులో ఆరంభమైనవి.[3][4] ఫాతిమిద్ ఖలీఫాల కాలంలో, వీరు, ముహమ్మద్ ప్రవక్త కుమార్తె యగు ఫాతిమా జహ్రా వంశస్థులు, వీరు మొదట 'మీలాదె నబీ' ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు, సూఫీ తరీఖాలకు అనుగుణంగా వుండేవి.[5][5][6] ఈ ఉత్సవాలు, దిన సమయాన జరుపుకునేవారు.[7] ఈ ఉత్సవాలలో అహలె బైత్ (ముహమ్మద్ ప్రవక్త వంశస్థులు) కు, ప్రధాన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్‌ను పఠించేవారు, ఇతర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించేవారు.[7]
చరిత్రలో సున్నీ ముస్లిం లలో మొదటి ఉత్సవాలు 12వ శతాబ్దం సిరియాలో నూరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి. అదే విధంగా స్పెయిన్, మొరాకో లోనూ జరిగాయి.[8] అయ్యూబీల కాలంలో, తాత్కాలికంగా ఆపబడినవి. ఇవి కుటుంబాల ఉత్సవాలుగా మారాయి.[9] కాని సలాహుద్దీన్ అయ్యూబీ బావయైన ముజఫ్ఫరుద్దీన్ ఆధ్వర్యంలో తిరిగీ అధికారికంగా 1207 ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 'మౌలీద్' లేదా 'మీలాద్' ఉత్సవాలు ఆరంభమైనవి.[5][6] ఈ ఉత్సవాలు ప్రపంచమంతటా వ్యాపించినవి. ఈజిప్టు లోని కైరో నగరానికీ వ్యాపించినవి. ఉస్మానియా ఖలీఫాయగు మురాద్ 3 కాలంలో ఉస్మానియా సామ్రాజ్యం లోకి ఇవి 1588 లో ప్రవేశించాయి.[3][10] 1910, లో ఉస్మానియా సామ్రాజ్యంలో, జాతీయ పర్వంగా ప్రకటింపబడింది. అనేక దేశాలలో కూడా మీలాద్, అధికారికంగా గుర్తింపబడింది.[3]
మీలాదె నబి జరుపుకునే సాంప్రదాయం లో, మస్జిద్ లను అలంకరిస్తారు, మీలాద్ లను జరుపుకునే ప్రదేశాలను, మీలాద్ ఘర్ లనూ అలంకరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త ప్రాశస్తాన్ని, జీవనగాధను, జీవనశైలి గురించి వర్ణిస్తారు. ఖసీదా బుర్దా (ముహమ్మద్ ప్రవక్త శ్లాఘన) లను పఠిస్తారు. దైవమార్గంలో ధనాన్ని ఇతరవస్తువులను ఖర్చు చేస్తారు. పిండి వంటకాలను తయారుచేసి పంచిపెడతారు. నాత్ క్వానీ (నాత్ లను పఠించడం లేదా రాగయుక్తంగా పాడడం) సర్వసాధారణం.[11][12][13] [14] [15] [16][17] ప్రపంచ నలుమూలలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.[18] సౌదీ అరేబియా దేశంలో మీలాదెనబి పండుగకు జాతీయ శెలవుగా ప్రకటించలేదు.[19]
జన్మదినోత్సవాన్ని మౌలీద్ అంటారు, అలాగే ముహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా, వీరి ప్రాశస్తాన్ని గాన రూపంలోనూ పాడతారు. ఈ పాటలనీ "మౌలీద్" అని అంటారు.[20] ఈ మౌలీద్ లలో ప్రవక్తగారి జీవనం గూర్చి విపులంగా వివరిస్తారు. అందులో క్రింది విషయాలు వుంటాయి:[20]
అలాగే అనేక రకాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో ఈ ఉత్సవాలు పలు రకాలుగా జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలలోని సభ్యతా సంస్కృతుల రీతులు కానవస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.