మిడుతల దండు

From Wikipedia, the free encyclopedia

మిడుతల దాడి లేదా మిడుతల దండు (ఆంగ్లం:The locusts attack) మిడతలు ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తో పాటూ ఆరు రాష్ట్రాల్లో సుమారు 80 మిలియన్లు అనగా 8 కోట్ల మిడతలు పాకిస్తాన్ నుండి 1993లో భారత్ వీటి దాడి చేశాయి, మళ్ళీ మే నెల 2020 లో దాడి ప్రారంభం చేశాయి[1].

వంద సంవత్సరాల క్రితం

ఆఫ్రికా అడవుల్లో వీటి జననం వీటీ సంతానం అభివృద్ది చెందినట్టు ఒక అంచనా, వేసవి కాలం అక్కడి అడవులు పచ్చదనం లేక తగినంత ఆహారం వాటికీ లభించక ఇతర ప్రాంతాలకు దాడి ప్రారంభం మొదలవగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ మీదుగా భారత్ లోకి ప్రవేశించాయి. మిడతలు గంటకు పదిహేను కిలోమీటర్లు ప్రయాణించగలవు సుమారు ఒక రోజులో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయగలవు.మిడతల దండు మన దేశానికి కొత్తగాదు. గాలివాటంతో ప్రయాణం చేస్తూ ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈ మిడతల దాడి చేస్తుండగా గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే దాడి చేశాయి[2].గత పదేళ్లుగా అప్పుడప్పుడు వీటి తాకిడివున్నా, చాలా స్వల్ప సంఖ్యలో రావడం.. రాజస్తాన్, గుజరాత్‌లలోని ఒకటి రెండు జిల్లాలకు సమస్య ఏర్పడటం ఉండేది. ఈసారి అవి కోట్లాదిగా వచ్చిపడ్డాయి. ఇంతటి భారీ సంఖ్యలో మిడతలు మన దేశం వచ్చిన ఉదంతాలు 1787–1796 మధ్య.. 1901–1908 మధ్య ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కూడా మిడ తల దండు రావడం రివాజైనా కోట్లాదిగా వచ్చిన దాఖలా లేదు. మన దేశం మాత్రమే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అఫ్ఘానిస్తాన్, ఆఫ్రికాతోసహా 64 దేశాలు ఈ మిడతల దండువల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికి ఒక్క రాజస్తాన్‌లోనే అయిదు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని అంచనా. ఈ మిడతల దండు పచ్చదనం అధికంగా వున్న నగరాలు, పట్టణాలను సైతం వదలటం లేదు.

వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)

భూతాపం వల్ల హిందూ మహాసముద్రంలోని పశ్చిమ ప్రాంత సముద్ర జలాలు వేడెక్కాయని, పర్యవసానంగా గత ఏడాది చివరిలో ఆఫ్రికా ఎడారి ప్రాంతంలోనూ, అరేబియా ద్వీపకల్పంలోనూ కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు కురిశాయని, అందువల్లే ఈ స్థాయిలో మిడతల బెడద వచ్చిపడిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలకు ముందు ఇక్కడ కురిసిన వర్షాలతో ఆ దండు మన దేశం వైపు వచ్చివుండొచ్చునని వారి అంచనా. రాజస్తాన్‌లపై విరుచుకుపడి, అటుపై ఉత్తరప్రదేశ్‌ వైపు వెళ్తూ గాలివాటుకు రెండుగా చీలి ఒకటి మధ్యప్రదేశ్‌ దిశగా పోయి అక్కడ విధ్వంసకాండ సాగించింది. మరో దండు ఢిల్లీ, హర్యానా వైపు వెళ్లింది. మధ్యప్రదేశ్‌వైపు వెళ్లిన దండు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లవైపు మళ్లినట్టు చెబుతున్నారు. ఇవి పగటిపూట ప్రయాణిస్తూ ఏపుగా పెరిగిన పంట చేలపైనో, పచ్చని చెట్ల పైనో, పచ్చికబయళ్లపైనో వాలతాయి. ఆకులు, పండ్లు, కూరగాయలు, జొన్న, వరి... ఇలా ఏది దొరి కితే అది స్వాహా చేస్తాయి. చీకటి పడేవేళ వున్నచోటే వుండిపోతాయి. ఒక దండు కదిలిందంటే అందులో కనీసం నాలుగు కోట్ల మిడతలుంటాయని, అవి ఒక్క రోజులో 35,000 మంది తినే ఆహా రాన్ని ఖాళీ చేస్తాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) చెబుతోంది. అంత ర్జాతీయ స్థాయిలో మిడతల తీరుతెన్నులపై అధ్యయనం చేసే ఏకైక సంస్థ అది. మిడతల దండు తాకిడికి లోనైన దేశాలు ఇచ్చే సమాచారాన్ని అందుకుని, అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి, ఆ దండు ఎటువైపు పోయే అవకాశం వుందో అంచనాకు రావడం... ఆ దిశగా వున్న దేశాలను అప్రమత్తం చేయడం దాని బాధ్యత. నిజానికి ఇప్పుడేర్పడిన బెడద చిన్నదని, వచ్చే నెలకల్లా అది మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం వున్నదని ఎఫ్‌ఏఓ మన దేశాన్ని హెచ్చరించింది.

లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎల్‌డబ్ల్యూ)

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.